Friday, July 18, 2025

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం అనేది భారతీయ తత్వశాస్త్రంలో చాలా ముఖ్యమైన భాగం. కర్మ అంటే కేవలం మనం చేసే పనులే కాకుండా, ఆ పనులు చేయడానికి మనలో కలిగే ఉద్దేశం కూడా కర్మ కిందకే వస్తుంది. కర్మలు ప్రధానంగా మూడు రకాలు:
 * సంచిత కర్మ: గత జన్మలలో మనం కూడబెట్టుకున్న మొత్తం కర్మల రాశిని "సంచిత కర్మ" అంటారు. ఇది ఒక బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసిన డబ్బు లాంటిది.
 * ప్రారబ్ధ కర్మ: సంచిత కర్మలో నుండి ఈ జన్మలో మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మల భాగం "ప్రారబ్ధ కర్మ". ఇది బ్యాంక్ అకౌంట్ నుండి ఈ రోజు మనం ఖర్చు పెట్టే డబ్బు లాంటిది. దీన్ని అనుభవించక తప్పదు.
 * ఆగామి కర్మ (క్రియమాణ కర్మ): ఈ జన్మలో మనం చేసే పనుల వల్ల ఏర్పడే కొత్త కర్మలు "ఆగామి కర్మ". వీటి ఫలితాలు భవిష్యత్తులో (ఈ జన్మలో లేదా వచ్చే జన్మలలో) ఉంటాయి.
మీరు అడిగిన "కర్మ లో సంచితం ఎలా చెయ్యాలి" అనే ప్రశ్నకు, సంచితం అంటే కర్మను కూడబెట్టడం. ఇది మనం చేసే ప్రతి పని, ఆలోచన, మాట ద్వారా జరుగుతుంది. మంచి పనులు చేస్తే మంచి సంచితం, చెడు పనులు చేస్తే చెడు సంచితం ఏర్పడుతుంది.
అయితే, ముఖ్యంగా కర్మలను తగ్గించుకొని, వాటి బంధాల నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోవడం అవసరం. దానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
కర్మలను తగ్గించుకునే మార్గాలు
1. నిష్కామ కర్మ
ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం: భగవద్గీతలో చెప్పినట్లు, మనం చేసే పనుల ఫలితాల పట్ల ఆశ లేకుండా, కేవలం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. "నేను చేస్తున్నాను" అనే అహంకారాన్ని విడనాడి, ప్రకృతి మనల్ని ఒక పనిముట్టుగా ఎన్నుకుందని భావించాలి. ఇది కొత్త ఆగామి కర్మలు ఏర్పడకుండా సహాయపడుతుంది.
2. ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధన
మనసును నియంత్రించడం: ఆలోచనలను తగ్గించి, మనసును శూన్యం చేయడం ద్వారా కాంతి మనలోకి ప్రవేశించి శక్తిగా మారుతుంది. ఇది కర్మల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాసపై ధ్యాస పెట్టడం, ఇతర ధ్యాన పద్ధతులు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
3. సత్కర్మలు ఆచరించడం
మంచి పనులు చేయడం: ఇతరులకు సహాయం చేయడం, దానధర్మాలు చేయడం, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటి మంచి పనులు పుణ్య కర్మలను పెంచుతాయి. ఇవి పాత కర్మల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
4. జ్ఞానం పొందడం
కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం: కర్మల స్వభావాన్ని, వాటి పనితీరును అర్థం చేసుకోవడం ద్వారా మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. జ్ఞానం పెరిగే కొద్దీ కర్మ బంధాలు బలహీనపడతాయి.
5. కర్మ సమర్పణ
కర్మ ఫలాలను దైవానికి సమర్పించడం: రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం నిద్ర లేవగానే, మనం చేసిన పనులన్నింటినీ, వాటి ఫలితాలను దైవానికి సమర్పించి, ఫలితాల పట్ల ఆశ లేకుండా ఉండటం ద్వారా కర్మ బంధాల నుండి విముక్తి పొందవచ్చు.
ముఖ్య గమనిక: కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం చేసిన కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. అయితే, ఈ పైన చెప్పిన మార్గాలను అనుసరించడం ద్వారా కర్మల బంధాన్ని తగ్గించుకొని, మోక్షానికి మార్గం సుగమం చేసుకోవచ్చు.
మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, మీరు కర్మల గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?

Sunday, March 30, 2025

ఉగాది పంచాంగ శ్రవణ విశేషం

్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
----------------------------------------
ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.       అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.
అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.
అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.
ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. 
ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.
----------------------------------------
ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు.
కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.
అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
-----------------------------------
*పురాణ గాథ!*
-------------------------------------
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు  శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు.
దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు.
అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు.
వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట.
నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.        ----------------------------------
       *ఉగాది పండుగ*
----------------------------------- *కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే! ఆనందమే! ఇట్టి పవిత్రవిశాల భావన లేకుండా ఆచరించే పండుగలు దండుగలే అవుతాయి. పిండివంటలూ, మధురపదార్ధాలూ తిని, రజస్తమోగుణాలు నింపుకోవడం తప్ప - సాత్త్విక ప్రవృత్తి లభించదు. కనుకనే మనపూర్వులు ప్రతిపండుగకూ ఒక అధిష్ఠానదైవం, పూజ, నియమాలూ, ఆహార విశేషాలూ ఏర్పాటు చేసినారు. పవిత్రభావంతో చేసే ప్రతి కార్యమూ ఇహపర ఆనందదాయకమే అవుతుంది.*
--------------------------------------       *''ఉగాది'' ప్రత్యేకించి - ఇతర వ్రతాలూ, పండుగల వలె ఏదో వొక దేవతను ఉద్దేశించి చేసేది కాదు. ఆనంతమైన కాలాన్ని - మన సౌలభ్యగణనం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి, సంవత్సరాదినాడు కాలాన్ని మన ఇష్ట దైవస్వరూపంగానూ, సకల దేవతా స్వరూపం గానూ భావించి, సంవత్సరకాల భవిష్యత్తును ముందుగా తెలుసుకొని ఆయా సమయాల్లో దైవానుగ్రహ ప్రాప్తికై చేయాల్సిన సాధనాలను సిద్ధపరచుకొనే ఒక చక్కని శాస్త్రీయ ప్రణాళికకు పూర్వరంగం ఏర్పరచుకోవడం ఉగాది విశిష్టత.*
---------------------------------------  *కాలగణనంలో ఒకప్పుడు మార్గశిరంతోనూ, వైశాఖంతోనూ, కార్తికంతోనూ, ఆశ్వయుజంతోనూ ఇలా అనేకవిధాలుగా సంవత్సరం ప్రారంభమైన విశేషాలు మనవాఙ్మయంలో కన్పిస్తున్నాయి. అట్లే యుగ ప్రారంభ తిథి విషయంలోనూ కల్ప, మన్వంతరాది భేదాన్నిబట్టి తేడాలున్నాయి. నక్షత్రాలను కూడా యుగాది నక్షత్రాలుగా పేర్కొన్నారు.*
  -------------------------------------          *వరహమిహిరాచార్యుని నిర్ణయాన్నిబట్టి, మనం చాంద్రమానం రీత్యా చైత్రమాసాన్నే సంవత్సరారంభంగా భావించి, చైత్ర శుక్ల ప్రతిపత్తు (పాడ్యమి) నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించినాడన్న శాస్త్రవాక్కును ప్రమాణంగా గైకొని, దీన్నే ''యుగాది''గా గణించి, ఉగాది పండుగను ఆచరిస్తున్నాము. ప్రతి దేశంలోనివారూ, రాష్ట్రంలోనివారూ ఏదోవొక కాలగణనంతో ఉగాది పండుగను తమ సంప్రదాయం ప్రకారం జరుపుకొంటూనే ఉన్నారు. ఆచరించే విధానంలో తేడా వున్నా ఆశయంలో, ఆనందంలో మాత్రం తేడాలేదు.*
-------------------------------------    *తెలుగువారేకాక, కర్ణాటకులు, మహారాష్ట్రులు, చాంద్రమానాన్ని అనుసరించే మాళవీయులు మున్నగు వారు,రునూ ఉగాది పండుగను చైత్ర శుక్ల పాడ్యమినాడే ఆచరిస్తున్నారు.*
-------------------------------------
*మనం జీవిస్తున్న ఈసృష్టి జరిగిన రోజును పండుగగా మనం పుట్టినరోజును పండుగగా జరుపుకొంటున్నట్లుగా భావించి, ఈ ఉగాది పండుగను ఆనందంతో సంవత్సరంలో తొలిపండుగగా జరుపు కొంటున్నాము. జరుపుకోవాలి కూడా!*
--------------------------------------
*సూర్యోదయానికి పాడ్యమి ఉన్న రోజునే (చైత్రశుక్ల పాడ్యమి) ఈ పండుగను ఆచరించాలి.*
---------------------------------------
*"చైత్రేమాసి" జగద్ర్బహ్మా ససర్జ ప్రథమేsహని*

*శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి"*
---------------------------------------        *అని హేమాద్రి నిర్ణయం! కనుక చైత్రశుద్ధపాడ్యమి సంవత్సరాది. ఉదయానికి పాడ్యమి ఉండాలి. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధపాడ్యమి, సూర్యోదయవేళ ఈ సృష్టిని సమగ్రంగా చేసినాడు. అందుకు కృతజ్ఞతాసూచకంగా, జ్ఞాపక చిహ్నంగా యుగాది పండుగ జరుపుకొంటున్నాము.*
------------------------------------         
*చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉపవాస ముండి, బ్రహ్మను పూజించినవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు. ఒకవేళ చైత్రం అధికమాసంగా వస్తే, అధికమాస ప్రారంభంనాడే ఉగాది జరుపుకోవాలి. అంతేకాని నిజచైత్రారంభంలో కాదు.*
-------------------------------------

Wednesday, January 8, 2025

సంక్రమణ పుణ్యకాలం - పురుష లక్షణం

బోగి-: 13/01/25పుష్య శుద్ధ చతుర్దశి/పౌర్ణమి. సోమవారం
సాయంత్రం 05 తర్వాత భోగి పళ్ళు వేయడం  చేయవచ్చును

మకర సంక్రాంతి -:మకర సంక్రమణ ఉత్తరాన పుణ్యకాలాన్ని పదవ సంక్రమణము అయనమనే పేరుతో ఉంటుంది
సంక్రాంతి -: 14/01/25 పుష్య బహుళ పాడ్యమి మంగళవారం పుణ్య కాలం 
మ02-45  పుణ్యకాల సమయమునకు 
తరువాత (పర) సమయంలో  40 గడియలు అనగా  16 గంటలు అనగా రాత్రి 06 గంటల 45 నిమిషాలు వరకు ప్రభావం వుండును (15/01/24 తెల్లవారుజామున 02 గంటల నుండి ఉదయము 6:45 నిమిషాల లోపున పెద్దలకి సంబంధితమైన బియ్యాలు ఇవ్వడం చేయుట చాలా మంచిది) 

సంక్రాంతి పుణ్యకాల దీపారాధన చేయాలన్న పుణ్యకాలానికి 10 గడియలు ముందు నుంచి ప్రారంభం చేసుకోవచ్చు 
14/01/25 ఉదయం 10 గంటల తర్వాత దీపారాధన చేసుకొని పెద్దలకి సంబంధించిన బట్టలు పెట్టుకోవచ్చును

కనుము-:15/01/25 పుష్య బహుళ విదియ  బుధవారం

ముక్కనుము -: 16/01/25 పుష్య బహుళ తదియ గురువారం

Saturday, December 21, 2024

సృష్టి రహస్య విశేషాలు.


సృష్టి రహస్య విశేషాలు.......!!
1 సృష్టి  ఎలా  ఏర్పడ్డది
2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది
3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి
( సృష్ఠి )  ఆవిర్బావము.
1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాధం
4  నాధం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృథ్వీ.
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.
( సృష్ఠి ) కాల చక్రం.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఎంతో మంది శివులు 
ఎంతోమంది విష్ణువులు 
ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు
ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) . 
1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం.
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు   జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం
( పంచ భూతంలు ఆవిర్భావం )
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5  ఙ్ఞానేంద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు
1  ( ఆకాశ పంచికరణంలు )
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి
2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.
3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.
4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.
5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.
( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు
1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.
5  (  పంచ తన్మాత్రలు )
1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు
5  ( పంచ ప్రాణంలు )
1  అపాన
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన
5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మేంద్రియంలు )
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం
1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం
6  (  అరిషడ్వర్గంలు  )
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మాత్సర్యం
3  (  శరీరంలు  )
1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం
3  (  అవస్తలు  )
1  జాగ్రదావస్త
2  స్వప్నావస్త 
3 సుషుప్తి అవస్త
6 ( షడ్బావ వికారంలు )
1 ఉండుట
2 పుట్టుట
3 పెరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట
6 ( షడ్ముర్ములు )
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం
.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం
3 ( జీవి త్రయంలు )
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞుడు
3 ( కర్మత్రయంలు )
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
5 ( కర్మలు )
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
3 ( గుణంలు )
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
9 ( చతుష్ఠయములు )
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
      ( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి

14 మంది ( అవస్థ దేవతలు )
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు

10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
10 ( వాయువులు )
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
7 ( షట్ చక్రంలు )
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం

( మనిషి ప్రమాణంలు )
96 అంగుళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 ముారల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం
( మానవ దేహంలో 14 లోకాలు ) పైలోకాలు 7
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మాంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో

అధోలోకాలు 7
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకాల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో

( మానవ దేహంలో సప్త సముద్రంలు )
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చెమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షీర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు

( పంచాగ్నులు )
1 కాలాగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభిలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో

7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
1 జంబుా ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుపైన
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వెంట్రుకల్లో

10 ( నాధంలు )
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం.

సర్వేజనాః సుఖినోభవంతు

Tuesday, October 29, 2024

*ధన త్రయోదశి ప్రాముఖ్యత*

*ధన త్రయోదశి  ప్రాముఖ్యత* 



ఆశ్వీయుజ మాసంలో కృష్ణ పక్షం లో వచ్చేటువంటి త్రయోదశికి ధన త్రయోదశి అని పేరు.

ధనత్రయోదశి రోజున చేయవలసిన పనులు ఏమిటి తెలుసుకుందాం.ఈ ధన త్రయోదశి అనేది యమధర్మరాజుకి ప్రీతికరమైన రోజు. ఆరోజున ఆయనను పూజించడం వలన మరియు  దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగించి నరకలోకప్రాప్తి లేకుండా చేస్తారు.
ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలను లక్ష్మీదేవికి అలంకరించి పూజించాలి.
పూర్వకాలంలో హేమరాజు అనేటువంటి ఒక మహా రాజు ఉండేవాడు. ఆ మహారాజు కుమారుడు పేరు సులోచనుడు. ఆ సులోచనుడు యొక్క జాతకం ప్రకారం వివాహమైన నాలుగవ రోజు మృత్యు గండం ఉందని జ్యోతిష్యులు తెలియజేశారు.ఆ తర్వాత కొంత కాలానికి వివాహ వయస్సు వచ్చేసరికి వివాహం చేశారు. కానీ ఆ నాలుగో రోజు రానే వచ్చింది ఆరోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడు అని బాధపడ్డారు కానీ అదేమీ తెలియని ఆ రాకుమారి తన నగలన్నీ తీసి అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమ దీపం వెలిగించి గుమ్మం లో పెట్టింది.తనకు ఉన్న మృత్యు దోషం ప్రకారం ఆ యమధర్మరాజు 4వ రోజున రానే వచ్చారు సర్ప రూపంలో రాకుమారుడిని కాటు వేయడానికి.ఆ సర్పరూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు గుమ్మం లో పెట్టిన యమ దీపం మరియు లక్ష్మీదేవికి అలంకరించిన బంగారు నగల యొక్క కాంతి ని చూసి మైమరిచిపోయారు. ఈ లోపల సులోచనుడు యొక్క మృత్యు గండ సమయం దాటిపోయి మృత్యు గండం తొలగిపోయింది.
అందుకని యమ ప్రీత్యర్థం గుమ్మం సాయంకాలం గుమ్మంబయట యమ దీపం పెట్టి  దాని కింద  శ్రీముగ్గు వేసి గుమ్మానికి ఒకపక్కగా పెట్టి పూజించండి.లక్ష్మీదేవికి బంగారు నగలు అలంకరించి లక్ష్మీ పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఈ యమ దీపం అనేది మట్టి ప్రమిదలో వత్తులు వేసి నువ్వుల నూనెతో చెయ్యాలి. 
ఆ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగాపెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు చేకూరుతాయి.

Friday, October 4, 2024

నవగ్రహ పీడా హర స్తోత్రమ్



జాతకం /వివాహా పొంతన చూడాలి అన్న ఏమీ అవసరము?




జాతకం రాయించుకోవడానికి తేదీ సమయాలు వెతికి వెతికి తెచ్చుకొని అవసరం లేదు జాతకం వెతికి వెతికి రాయించుకోవడం కూడా ఖచ్చితమైన పద్ధతి కాదు కాబట్టి పుట్టిన తేదీ కచ్చితంగా ఉండి సమయం లేకపోయినా, సమయం ఖచ్చితంగా తెలిసి పుట్టిన తేదీ అనుమానం ఉన్న  అలాంటివి జాతకాలు రాయించుకోవడం మంచిది కాదు దాని బదులు పేరు ప్రకారంగా ప్రశ్న ప్రకారం గా చెప్పించుకోవడమే చాలా ఉత్తమం
ఇంకా అనేక రకాల సందేహాలు ఉంటే కింద రాసిన విషయాలు చదవండి


జాతకం రాయిటకు ఏమి అవసరము?
పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం సమస్య
ఇవి కచ్చితంగా తెలియాలి లేక పోతే ఆ జాతకం రాయడం ఇబ్బంది అవుతుంది. అలా ఉన్నప్పుడు నామ నక్షత్ర ప్రకారంగా గాని ఆ సమస్యకు తగ్గ ప్రశ్న చక్రం చేసుకుని చూడవచ్చు అంతేగాని అంచనాగా జాతకం రాయించుకుని దాని నుంచి వచ్చే పరిష్కారాలు చేయించుకోవడం వల్ల లేని రోగానికి మందు వేసుకున్నట్టు ఒక తల్లి గర్భంలో పుట్టిన కవలలు కూడా ఒకలా జాతకం ఉండదు
జాతకం అనేది చాలా సున్నితం కావున పై అడిగిన ముఖ్యమైన విషయాలన్నీ ఉంటేనే జాతకం రాయాలి

2)జాతకం రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది?
మా వరకు జాతకం రాయడానికి 7 రోజులు తీసుకుంటాం
అనేక పనులు ఒత్తిడి వల్ల ఆ జాతకుడి కోసం కొంత సమయం రోజుకి కేటాయించుకుని ముఖ్యమైన విషయాలని ఒక దగ్గరకి చేర్చి రాసుకొని ఒక కొన్ని పేజీల్లో మీకు అందజేస్తాం

3) జాతకం రాసింది ఉన్నది అది పనికొస్తుందా?
ఒక వ్యక్తి జాతకం ఏ పంతులుగారు రాసిందైనా అది పనికి వస్తుంది ఒకవేళ దానికంటే ఇంకా రాసుకోవాలి అన్న ఎక్కడ వరకు రాశారో అక్కడ నుంచే ప్రారంభం చేసుకుంటారు అది బాగుందో లేదో చూసుకుని అప్పుడు రాసుకుంటాం, జనన పత్రిక అని ఉంటుంది పుట్టిన వెంటనే రాయించుకునేది అది 12వ సంవత్సరం వయసులోపు విషయాలు
గమనించాలి, జాతక పత్రిక ఇప్పుడు మనం చూపించుకునేది, జాతక పుస్తకం ఇది తదుపరిది
మీ దగ్గర జాతక పత్రిక గాని జాతక పుస్తకం గాని ఉంట పనికొస్తుంది వెంటనే చూపించుకోవచ్చు ఒకవేళ లేకపోతే మైము రాయుటకు 7 రోజులు పట్టును 
 అలా రాసింది ఉంటే వెంటనే చూసి చెబుతాము
ఒకవేళ సమయంలో మీకేమైనా అనుమానాలు ఉంటే కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది

మీ దగ్గర ఉన్నది జాతకం ఏటువంటిదో తెలియకపోతే వాట్సప్ లో పంతులు గారికి పెట్టి సరిపోతుందా లేదా అని అడిగి అప్పుడు రావాలి 

4) జాతకం రాసి ఉన్నది కానీ చాలా రోజులు అయిపోయింది అండి, అది పనికొస్తుందా?
ఒకసారి జాతకం రాసిన తర్వాత జాతకం జీవితాంతం పనికి వస్తుంది జాతక చక్రం అనేది ఉంటుంది రాసి చక్రము నవాంశ చక్రము భావచక్రము దశలు అంతర్దశలో విదశలు కట్టేసి ఉంటాయి ఆ విధంగా ఉంటే దాన్ని జాతకం అంటారు

##మా దగ్గర ఇలా జాతకం ఉన్నది పనికొస్తుందా 






(పైన ఉన్న జాతక చక్రాలు జననపత్రికలు అంటారు జన్మ సమయమును నిర్ధారణ చేయడానికి మాత్రమే ఆధారపడతాయి మిగతా విషయాలు విశ్లేషణ చేసినప్పుడు కొన్ని అనుకూలిస్తుంటాయి కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. అవి కచ్చితంగా జరుగుతాయని చెప్పడం కష్టం. కారణం గ్రహాల మధ్య దూరం ఇందులో ఉండదు) 

ఉదాహరణకు 







ఇది రాసి చక్రం (అందులో గు,బు,శు,శ  గ్రహ దూరం తెలియదు నవాంశలో గాని ప్రత్యేక రాశిలో గానీ చూడాలి నవాంశలో కూడా చూసేటప్పుడు కొంత సమయ పట్టే అవకాశం ఉంటుంది, ప్రత్యేక రాశి చక్రం చాలా ముఖ్యం కింద విధంగా డిగ్రీలతో సహా దూరం తెలుస్తుంది )

ఇది ప్రత్యేక రాశి చక్రం గ్రహాల మధ్య దూరము తెలుసుకోవచ్చు 

పరాసరి జ్యోతిష్యం ప్రకారంగా 
క్రింది భావచక్రం ఉండాలి 



రాశి చక్ర ప్రకారంగా శ్రీపతి భావచక్రంలో పరిశీలన చేసినప్పుడు అనే అక్షరం మారింది అది గ్రహము బావము మారినట్టు, ఒక్కొక్కరికి అయితే రెండు మూడు గ్రహాలు కూడా మారిపోతూ ఉంటాయి  ఇలా గనక జాతక చక్రంలో ఒక్కొక్కరికి మారుతుంది ఒక్కొక్కరికి మారదు. ఈ విషయం రాసినప్పుడు మాత్రమే తెలుస్తుంది రాయకుండా పరిశీలన చేసినప్పుడు వాళ్లకు చెప్పవలసిన ఫలితాలు కూడా తారుమార  అయ్యే అవకాశాలుంటాయి 

కేపీ జాతక చక్ర ప్రకారం ప్లాసి ధర్స్ భావ చక్రం క్రింది విధంగా ఉంటుంది 

ఇంకా అత్యవసరమైన ఈ విధంగా కూడా కేపీ ప్రకారంగా వేసుకోవడం జరుగుతుంది


5) ఉద్యోగం, వివాహం ఆరోగ్యం ఇలాంటి చిన్న విషయాలన్నీ దానికి కూడా జాతకం అవసరమా?
జీవితంలో జరిగిన ఏ సంఘటనైనా సరే అది చాలా ముఖ్యమైనది దానివల్ల మనం బాధపడుతున్నాము అంటే అది చాలా దోషకరమైనది దోషం జాతక చక్రంలో ఏ గ్రహాల వల్ల వచ్చింది అని తెలుసుకోవాలంటే జాతకంలో చాలా ముఖ్యమైన చక్రం భావచక్రం అలాంటి భావచక్ర ప్రకారంగా దోషాలని గ్రహించి వాటికి సంబంధించిన పరిష్కారాలు చెప్పాలి తరువాత ఆ దోషం ఎప్పుడు వరకు ఉంటుంది తర్వాత మంచి ఏ విధంగా జరుగుతుంది అనేది మన తేదీల ప్రకారంగా చెప్పడం కోసం దశ అంతర్దశ విదశ అనే పట్టిక ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నప్పుడు వెంటనే చూపించుకోవచ్చు 

పైన చూపించినట్టుగా భావచక్రంలో గ్రహాలు మారిపోయినప్పుడు కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా ఫలితాలు మారిపోతుంటాయి అందుకనే అది గమనించాలి 

6) జాతకం లేకపోతే చూడడానికి అవ్వదా?
జాతకం లేకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క నామ నక్షత్ర ప్రకారంగా కొంత చెప్పడానికి అవకాశం ఉంది మరియు ఆ వ్యక్తి యొక్క సమస్యకు తగ్గ పరిష్కారం ప్రశ్న చక్రం చూపిస్తుంది. కావున అది చెప్పించుకోవచ్చు

7) జాతకం ఉండగా ప్రశ్న చక్రం చూసుకోవచ్చా జాతకం
,చూపించుకోకుండా?
ఆ విధంగా చూపించడం అనేది మంచి పద్ధతి కాదు కారణం జాతకంలోని ఆ అవకాశం ఉన్నది అని తెలిసిన తర్వాత అప్పుడు ప్రశ్న చక్రం వేసుకోవచ్చు అసలు మనకు జాతకమే తెలియనప్పుడు ప్రశ్న ద్వారా వెళ్లాలి జాతకం ఉన్నది అనుకుంటే జాతకం చూస్తూనే ప్రశ్న వేసుకోవాలి, పిల్లలకి భవిష్యత్తు సంబంధమైన విషయాలు కావున అశ్రద్ధగా మాత్రం మీరు ఉండకూడదు కొంత సమయాన్ని తీసుకుని డేటు టైము పుట్టిన స్థలం అని ఉన్నాయ్ అనుకుంటే ఈ జాతకం ద్వారానే వెళ్లాలి లేవు అనుకుంటే అప్పుడు పేరు లేదా ప్రశ్న ప్రకారంగా వెళ్లవచ్చును


8) జాతకం రాయించుకోవడానికి మేము ఏ విధంగా సంప్రదించాలి?
ఆఫీస్ దగ్గరికి వచ్చి జాతకాలు రాసే పుస్తకం అక్కడ వాళ్ళు ఇస్తారు పై అడిగిన వివరాలన్నీ దాంట్లో మెరెక్కించుకుని ఆ జాతకం కోడ్ అనేది ఉంటుంది అక్కడ అది ఎక్కించుకుని వెళ్లాలి వచ్చేముందు కోడ్ చెబితే రాసిన జాతకాలని ప్రింట్ తీసి ఉంచుతాం,

విధానం -: 1#

ఈ పేజీని ఎక్కించి పంపించవలసి ఉంటుంది 

2#ఫోన్ ద్వారా అయితే మంగళవారం పూట ఎక్కించడం జరుగుతుంది లేదా మిగతా రోజుల్లో మీరు ఆఫీసుకు వచ్చి కూడా ఎక్కించుకోవచ్చు ఒకవేళ మిగతా రోజుల్లో మీరు పంపించిన ఎక్కించడం జరుగుతుంది కాని ఒకవేళ మీకు నెంబర్ రాకపోతే మంగళవారం ఫోన్ చేయాలి 

3#వారంలో మీరు ఎప్పుడు ఎక్కించినా సరే మంగళవారం నుంచి మాత్రమే రాయడం జరుగుతుంది అలా ఎక్కించిన తర్వాత వారం రోజుల తర్వాత ఆ జాతకం పేపర్ ని వారం రోజుల తర్వాత వచ్చే మంగళవారం నాడు మాత్రమే ఈ నెంబర్ కి 9490131636 వాట్సాప్ పెట్టాలి మీ దగ్గర ఉన్న పైన రాసిన కాగితం 

4#రాయడం పూర్తయిన తర్వాత 
మీకు క్రింద విధంగా ఫోటో వస్తుంది , వాయిస్ మెసేజ్ కూడా వస్తుంది పుట్టిన తేదీ పుట్టిన సమయం (AM అంటే అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే సమయం, PM అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి అర్ధరాత్రి 12), పుట్టిన ప్రదేశం కూడా చూసుకోవాలి మీరు పుట్టిన ప్రదేశానికి దగ్గరగా ఉండే ప్రధాన నగరం ఉన్న సరిపోతుంది ,
ఆంగ్ల నామంలో స్వల్పమైన మార్పులు ఉన్నా  ఇబ్బంది లేదు


 

5# మీరు అన్ని చూసి ఓకే అన్న తర్వాత మీకు ఎప్పుడు రావాలనేది వాట్సప్  లో  
పంతులుగారు చెప్పిన సమయానికి 10 నిమిషాల ముందు కచ్చితంగా ఉండాలి లేదా ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది

6#జాతకం పేపర్ మీద ఎక్కించిన తర్వాత మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ముందుగానే చెప్పాలి జాతకం రాసిన తర్వాత గనక తప్పిదాలు చెప్పినప్పుడు అక్కడినుంచి మళ్ళీ వారం రోజుల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది 

7#ఉదాహరణ జాతకం ఏ విధంగా ఉంటుందో కిందని లింక్ ఇవ్వటం జరిగింది చూడవచ్చును 
https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:dfe20dbf-a75b-4a51-8f72-d5663d0e8f00


10) పిల్లలిద్దరికీ ఒకేసారి జాతకం రాయించుకోవచ్చా ?
జాతకం రాయించుకున్న తర్వాత వారికి చేసే పరిహారాలు ఒకే సంకల్పంతో చేయడం వల్ల ఆ పరిహారాలు వాళ్ళకి నెరవేరకపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఉద్యోగ వివాహానికి కలిపి గృహ యోగము సంతానానికి కలిపి, ప్రయాణం కోసం ,చదువు కోసం కలిపి, ఆకస్మికమైన ధనం ప్రభుత్వానికి కలిపి
అనారోగ్యం వివాహానికి కలిపి
ఇంటి నిర్మాణం వివాహానికి కలిపి ఇలా కలిపి సంకల్పం చెప్పుకునే వివిధ రకాలైన పూజలు చేయడం వల్ల ఏ పూజలు నెరవేరు ఎవరూ కూడా దాని ఫలితాన్ని పొందరు దాన్ని గమనించు మేము ఇద్దరికీ కూడా ఒక వారం వ్యవధి పెడుతున్నాం దాని వలన వీళ్ళు చేసే పూజల్లో సంకల్పాన్ని విడిగా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇది గమనించుకొని ఇద్దరికీ ఒకసారి మాత్రం రాయవద్దు

11) జాతక చక్రంలో అతి ముఖ్యమైనది పరాసరి జ్యోతిష్య విధానంలో శ్రీపతిబావ చక్రం ప్రకారంగా పరిశీలన చేయడం చాలా ముఖ్యం అది మీ దగ్గర ఉండాలి లేకపోతే పంతులు గారికి రాయడానికి సమయం ఇవ్వాలి. పైన చెప్పిన విధంగా
kp ఆస్ట్రాలజీ లో ప్లాషీదర్ భావ చక్రం చాలా ముఖ్యమైనది


12) పై వివరాలు పంతులు గారికి ఇచ్చి తగు సమయం ఇస్తే వివరంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని అత్యవసరమండి లేదంటే జాతక చక్రం రాయించుకుంటాం గానీ ముందుగా మాకు ఈ సమస్య చిన్న సమస్య నుండి అని ఆ సమస్య గురించి మీరు చిన్న పెద్ద నిర్ధారణ చేయకూడదు అది పంతులుగారికి కూడా తెలియదు ఆ సమస్య పరిశీలన చేసిన తర్వాత అప్పుడు చిన్న పెద్ద నిర్ధారణకు వచ్చి అతను దానికి తగ్గ పరిహారం చెబుతారు జాతకం చూడకుండా మాత్రం పరిహారాలు చేయకూడదు 


14) దూరప్రాంతాలు వాళ్లకి ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలంటే ఒక మంగళవారం రోజున మాత్రమే అవుతుంది (సోమవారం రాత్రి లోపున మెసేజ్ పెట్టవలసి ఉంటుంది)
8520000609 కి కాల్ చెయ్యాలి


...........................శుభం............................................


వివాహ పొంతన చూచుటకు కావలసిన వివరాలు
ఏమిటి?
13) అబ్బాయి - అమ్మాయి పెళ్ళి కి పొంతన చూడాలి ఏమీ అవసరం?
ఇద్దరిదీ 
పుట్టిన తేదీ -:
పుట్టిన సమయం -:
పుట్టిన స్థలం -:   
*ఇద్దరికీ ఖచ్చితముగా వుండాలి ,కాకుండా సర్టిఫికెట్ మీద కాకుండా, పుట్టిన తేదీని అంచనా పెట్టుకుంది తేదీలు ఏర్పాటు చేయకుండా
పండగల్లో పుట్టారు అని అంచనాలు చెప్పకూడదు
వెతికి వెతికి అనుమానంగా తేదీలు చెప్పకూడదు
వెతకమని బలవంతం చేయకూడదు
12) ఇద్దరి  లో ఒకరికి పుట్టిన తేది, పుట్టిన సమయం, పుట్టిన స్థలం ఒకరికి ఉన్నది?
ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే పూర్తిగా ఇద్దరిదీ పేరు బట్టి చూడడమే మంచిది. అంతేగాని ఇంకొకరిది వెతికి తెచ్చుకోవడం మంచిది కాదు అనుమానంతో చెప్పేది ఏది చెప్పి సమయం చెప్పలేదు సమయంలో చాలా ఎక్కువ తేడాతో చెప్పేది పుట్టిన స్థలం గురించి పూర్తిగా నిర్ధారణమైనది జాగ్రత్తగా చక్రం అంచనాగా వేసి చూసుకోవడం మంచిది కాదు