Sunday, September 26, 2021

ఇల్లు శంకుస్థాపన చేసిన సంవత్సరం లోపల గృహప్రవేశం చేయాలా?

ఇల్లు శంకుస్థాపన చేసిన సంవత్సరం లోపల గృహప్రవేశం చేయాలా?

 1.ఆ విధంగా చేయాలనే నియమం ఏ శాస్త్రంలోని కూడా లేదు పూర్వం నిర్మాణాలు చేయడం అంటేనే పెద్ద విషయం కింద భావన చేసేవారు ,వాళ్లు ఇల్లు కడుతున్నారు అంటే చాలా గొప్పగా భావించేవారు ఎందుకు అంటే అప్పుడు నివాసానికి మాత్రమే ఇల్లు ఉంటే చాలు అనుకునే వారు అలా ఉన్నా సరే పునాదులు కట్టి కొంతకాలం విడిచి పెట్టడం, లింటవరకు కట్టి కొంతకాలం విడిచి పెట్టడం, తర్వాత మళ్లీ స్లాబ్ వేసి కొంతకాలం విడిచిపెట్టి ,అప్పుడు ఇల్లు పూర్తి చేయుటకు నెమ్మదిగా చేసేవారు ఈ విధంగా ఇల్లు ఎక్కువకాలం పాటు కట్టడం వలన భూమి యొక్క సారం ,ఇల్లు బలం తగ్గుతుంది అనేది శాస్త్ర ప్రమాణం ఎక్కువ కాలం పాటు కట్టొద్దు అని చెప్పకుండా సంవత్సరంలోపు కడితే మంచిది అని చెప్పారు పంతులుగారు అని చెప్పేవారు
2. ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేయాలంటే అనేక శాఖల వారి యొక్క ఆలోచనలు లేకుండా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోతున్నారు ఒక ఇంజనీరు ఒక పంతులు గారి సలహా ఒక మేస్త్రీ అలాగే ఒక ఎలక్ట్రీషియన్ ఒక ప్లంబర్ ,గచ్చులు వేసేవారు, కార్పెంటర్, అదేవిధంగా సీలింగ్ వర్క్ చేసే వారు ఇలాగా అనేక శాఖల వారు ఇప్పుడు ఇంటి నిర్మాణాల్లో కలుస్తున్నారు
అప్పుడు అవకాశాలు లేక ఇల్లు ఆపితే ఇప్పుడు పని ఎక్కువ అవ్వడం వల్ల ఇల్లు ఎక్కువ కాలం నిర్మాణం చేయడం కూడా జరుగుతుంది
 అప్పుడు పని ఆపుతున్నారు అనే ఉద్దేశంతో పెద్దలు శాస్త్రాన్ని, పంతులుగారిని, ఉపయోగించుకుని పిల్లల చేత ఇంటి నిర్మాణాన్ని ఏ విధంగానైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కొన్ని శాస్త్రాలని మూఢనమ్మకాలని పెట్టారు అప్పుడు కాలం లోని వాటిని ఉపయోగించుకొని త్వరితంగా పని పూర్తి చేసుకుని ఒక శుభముహూర్తామును నిర్ణయం చేసుకుని దిగేవారు
 వాళ్ల శక్తి బట్టి పూజాది కార్యక్రమాలు అన్నీ
 పూర్తి చేసుకుని ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో దీపారాధన చేసుకునేవారు
3. ఇప్పుడు మనం గృహప్రవేశం లో చేసే తప్పులు
ఇప్పుడు ఆ సంవత్సరంలో దిగాలి అని మూఢ నమ్మకాన్ని పట్టుకుని
4. పని సగం సగం అవుతుండగానే మాకు సంవత్సరం లోపు ఈ తేదీలోపు ముహూర్తం చెప్పండి పంతులు గారిని స్వతహాగా ఆలోచించనివ్వకుండ 
 చేస్తున్నారు , పని సగం సగం అవుతున్నప్పుడు దిగుతున్నాము అంటే నెలలు నిండకుండా కాన్పు అయినట్టు అది శిశువు యొక్క ఆరోగ్యానికి ఇవ్వండి అలాగే గృహము యొక్క అరుబలానికి కూడా ఇబ్బంది అవుతుంది 
5. ఆపదల కోసం నీకు మూఢనమ్మకాలు చెప్పారు 
వివాహ విషయంలో సంవత్సరాలు లెక్క పెట్టారు 
పూజల విషయంలో సంవత్సరాల లెక్క పెట్టారు 
మరణ సంబంధాన్ని విషయాల్లో కూడా సంవత్సరాలు లెక్కపెట్టేవాడు 
ఆరోగ్యం ఆచారం వ్యవహారాలు ఉమ్మడి కుటుంబాలతో కోరుకున్న వ్యవహారాలని చక్కబెట్టడం కోసం కొన్ని మూఢనమ్మకాలను పంచాంగం ఉపయోగించుకుని నిర్ణయం చేసేవారు కానీ అది పంచాంగంలో ఉన్న విషయాలు కాదు ఏ శాస్త్రంలోని ఉన్న విషయాన్ని కాదు , అప్పుడు ముహూర్తం కు   ఇబ్బంది కలగకుండా,
 ఉమ్మడి కుటుంబాల వ్యవహారంలోని సామాజిక  వ్యవహారాల్లోని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేది 
6: దేవాలయం కంటే గొప్పదైన గృహములోని ఇప్పుడు గృహప్రవేశం చేసిన దగ్గర నుంచి దీపారాధన చేయటం లేదు మొక్కుబడి గృహ ప్రవేశం చేసి మరలా ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు వ్రతం చేసుకొని వెళుతున్నాను 
ఈ లోపున గృహప్రవేశం తేదీ మరిచిపోయేవారు కూడా గృహప్రవేశం నాడు పట్టుకుని వెళ్లిన దేవుడు 
పఠాలు పాడైపోయి గంగలో కడితే పరిస్థితికి కూడా వచ్చినవి ఉన్నాయి గృహప్రవేశము యొక్క బలం కూడా తగ్గిస్తున్నారు
7:దేవుడు మూల మాత్రమే సున్నం వేసి, టెంపరరీగా తలుపులు తెచ్చుకుని పెట్టి దేవుని పెట్టె మూడు రోజులు దీపారాధన కార్యక్రమాలను చూసుకుని
 అంటే యజమాని పడుకోడానికి కూడా అవకాశం లేని చోటు, చుట్టాలు చూడడానికి కూడా బాగోలేని ఇల్లు, ఇలాంటి వాటిలో మనం ప్రవేశం చేసి ఎవరి మానాన వాళ్ళు మూడు రోజులు అయిన తర్వాత దేవుని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు మరలా పని వాళ్ళు వచ్చి మిగతా పని చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళ లోనే అనేక రకములైన సౌచ దోషములున్న వాళ్ళు ఉంటారు ,ఇలా చేయడం వల్ల మనం చేసే గృహ ప్రవేశం ముహూర్తం ఆ బలం కూడా ఉండదు,
ప్రవేశం చేసిన ఇంట్లోనే ఎటువంటి మైళ్ళతో ఉన్నవాళ్లు కూడా తిరగకూడదు అంటే దేవుడు గది వంటగది యజమాని యజమానురాలు చూపిస్తేనే గాని చూడకూడదు. అలాంటిదే ఆ దేవున్ని యజమానులు తప్పించి అందరూ కలుపుతున్నారు అది ఇంటికి దోషం అది ముట్టుకోవడం తప్పు అసలు ఇంటిలో పోయే వెలిగించడం లేదు 
8: అసలు మన గృహంలో మనం దీపారాధన లేకుండా ఎప్పుడు ఉంచుదాం మేలు సమయాల్లో మాత్రమే ఉంచటం అలాంటి గృహప్రవేశం చేసిన ఇంటిలో దీపారాధన లేకుండా చాలా రోజులు ఉండిపోతున్నారు అంటే ఆ గృహం ఎటువంటి  అవుతుంది కావున యజమాని అసలు నివాసం లేని ఇంటిని మైలు ఇంటి కింద మారుస్తున్నారు

9:ప్రవేశం చేయడానికి ముఖ్యంగా మనం శాస్త్రంలో పాటించవలసిన విషయాలు 1.గృహప్రవేశానికి శ్లాబ్ వెయ్యాలి
2. పూర్వం మట్టి గచ్చులు ఉండేవి కాబట్టి గచ్చులు కూడా వేయమని చెప్పేవారు
3. ద్వారబంధము పెట్టాలి,తలుపులు బిగించాల
4. కుష్మాండ బలిచేయాలి అనగా గుమ్మడికాయ కొట్టాలి
10:సిమెంటు పన్నులు ఇంటి లోపల పూర్తిగా చేసుకుంటే మంచిది కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్కులు పర్వాలేదు ఎందుకు అనగా ఆది చేస్తున్నప్పుడు ఇంటి యజమాని   ఖాళీ చెయ్యనవసరం అవసరం లేదు
  లేదు అలాగే దీపారాధన మానవలసిన అవసరం కూడా లేదు కాబట్టి ముఖ్యముగా పై విషయాలను గమనించుకుని గృహప్రవేశం చేయాలి అంతేగాని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు వాళ్లు చెప్పారు వీళ్లు చెప్పారని కాకుండా శాస్త్రాన్ని కూడా కొంత మనం పట్టించుకోవాలి
11:పంతులు గారు మీ పేరు మీద మంచి ముహూర్తం నిర్ణయం చేసుకుని ఆ ముహూర్తం ఎప్పుడు కడితే అప్పుడు మనం గృహప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంది చేయవలసినవి అన్నీ కూడా ఆ రోజు ఆచరించాలి గృహప్రవేశం నీ మొత్తం కార్యక్రమాన్ని ముక్కలు ముక్కలుగా చేయకూడదు 
12: ఆపదల కోసం కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కానీ అతను ఆపధర్మంగా వాడుకోవాలనిపించి అదే ధర్మం కాదు

ఈ విధంగా మంచి ముహూర్తాలు నిర్ణయించుకుని ఇంటి యజమాని ఎవరు కుటుంబం కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములు పొందుదురు గాక