Tuesday, October 29, 2024

*ధన త్రయోదశి ప్రాముఖ్యత*

*ధన త్రయోదశి  ప్రాముఖ్యత* 



ఆశ్వీయుజ మాసంలో కృష్ణ పక్షం లో వచ్చేటువంటి త్రయోదశికి ధన త్రయోదశి అని పేరు.

ధనత్రయోదశి రోజున చేయవలసిన పనులు ఏమిటి తెలుసుకుందాం.ఈ ధన త్రయోదశి అనేది యమధర్మరాజుకి ప్రీతికరమైన రోజు. ఆరోజున ఆయనను పూజించడం వలన మరియు  దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగించి నరకలోకప్రాప్తి లేకుండా చేస్తారు.
ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలను లక్ష్మీదేవికి అలంకరించి పూజించాలి.
పూర్వకాలంలో హేమరాజు అనేటువంటి ఒక మహా రాజు ఉండేవాడు. ఆ మహారాజు కుమారుడు పేరు సులోచనుడు. ఆ సులోచనుడు యొక్క జాతకం ప్రకారం వివాహమైన నాలుగవ రోజు మృత్యు గండం ఉందని జ్యోతిష్యులు తెలియజేశారు.ఆ తర్వాత కొంత కాలానికి వివాహ వయస్సు వచ్చేసరికి వివాహం చేశారు. కానీ ఆ నాలుగో రోజు రానే వచ్చింది ఆరోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడు అని బాధపడ్డారు కానీ అదేమీ తెలియని ఆ రాకుమారి తన నగలన్నీ తీసి అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమ దీపం వెలిగించి గుమ్మం లో పెట్టింది.తనకు ఉన్న మృత్యు దోషం ప్రకారం ఆ యమధర్మరాజు 4వ రోజున రానే వచ్చారు సర్ప రూపంలో రాకుమారుడిని కాటు వేయడానికి.ఆ సర్పరూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు గుమ్మం లో పెట్టిన యమ దీపం మరియు లక్ష్మీదేవికి అలంకరించిన బంగారు నగల యొక్క కాంతి ని చూసి మైమరిచిపోయారు. ఈ లోపల సులోచనుడు యొక్క మృత్యు గండ సమయం దాటిపోయి మృత్యు గండం తొలగిపోయింది.
అందుకని యమ ప్రీత్యర్థం గుమ్మం సాయంకాలం గుమ్మంబయట యమ దీపం పెట్టి  దాని కింద  శ్రీముగ్గు వేసి గుమ్మానికి ఒకపక్కగా పెట్టి పూజించండి.లక్ష్మీదేవికి బంగారు నగలు అలంకరించి లక్ష్మీ పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఈ యమ దీపం అనేది మట్టి ప్రమిదలో వత్తులు వేసి నువ్వుల నూనెతో చెయ్యాలి. 
ఆ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగాపెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు చేకూరుతాయి.

Friday, October 4, 2024

నవగ్రహ పీడా హర స్తోత్రమ్



జాతకం /వివాహా పొంతన చూడాలి అన్న ఏమీ అవసరము?




జాతకం రాయించుకోవడానికి తేదీ సమయాలు వెతికి వెతికి తెచ్చుకొని అవసరం లేదు జాతకం వెతికి వెతికి రాయించుకోవడం కూడా ఖచ్చితమైన పద్ధతి కాదు కాబట్టి పుట్టిన తేదీ కచ్చితంగా ఉండి సమయం లేకపోయినా, సమయం ఖచ్చితంగా తెలిసి పుట్టిన తేదీ అనుమానం ఉన్న  అలాంటివి జాతకాలు రాయించుకోవడం మంచిది కాదు దాని బదులు పేరు ప్రకారంగా ప్రశ్న ప్రకారం గా చెప్పించుకోవడమే చాలా ఉత్తమం
ఇంకా అనేక రకాల సందేహాలు ఉంటే కింద రాసిన విషయాలు చదవండి


జాతకం రాయిటకు ఏమి అవసరము?
పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం సమస్య
ఇవి కచ్చితంగా తెలియాలి లేక పోతే ఆ జాతకం రాయడం ఇబ్బంది అవుతుంది. అలా ఉన్నప్పుడు నామ నక్షత్ర ప్రకారంగా గాని ఆ సమస్యకు తగ్గ ప్రశ్న చక్రం చేసుకుని చూడవచ్చు అంతేగాని అంచనాగా జాతకం రాయించుకుని దాని నుంచి వచ్చే పరిష్కారాలు చేయించుకోవడం వల్ల లేని రోగానికి మందు వేసుకున్నట్టు ఒక తల్లి గర్భంలో పుట్టిన కవలలు కూడా ఒకలా జాతకం ఉండదు
జాతకం అనేది చాలా సున్నితం కావున పై అడిగిన ముఖ్యమైన విషయాలన్నీ ఉంటేనే జాతకం రాయాలి

2)జాతకం రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది?
మా వరకు జాతకం రాయడానికి 7 రోజులు తీసుకుంటాం
అనేక పనులు ఒత్తిడి వల్ల ఆ జాతకుడి కోసం కొంత సమయం రోజుకి కేటాయించుకుని ముఖ్యమైన విషయాలని ఒక దగ్గరకి చేర్చి రాసుకొని ఒక కొన్ని పేజీల్లో మీకు అందజేస్తాం

3) జాతకం రాసింది ఉన్నది అది పనికొస్తుందా?
ఒక వ్యక్తి జాతకం ఏ పంతులుగారు రాసిందైనా అది పనికి వస్తుంది ఒకవేళ దానికంటే ఇంకా రాసుకోవాలి అన్న ఎక్కడ వరకు రాశారో అక్కడ నుంచే ప్రారంభం చేసుకుంటారు అది బాగుందో లేదో చూసుకుని అప్పుడు రాసుకుంటాం, జనన పత్రిక అని ఉంటుంది పుట్టిన వెంటనే రాయించుకునేది అది 12వ సంవత్సరం వయసులోపు విషయాలు
గమనించాలి, జాతక పత్రిక ఇప్పుడు మనం చూపించుకునేది, జాతక పుస్తకం ఇది తదుపరిది
మీ దగ్గర జాతక పత్రిక గాని జాతక పుస్తకం గాని ఉంట పనికొస్తుంది వెంటనే చూపించుకోవచ్చు ఒకవేళ లేకపోతే మైము రాయుటకు 7 రోజులు పట్టును 
 అలా రాసింది ఉంటే వెంటనే చూసి చెబుతాము
ఒకవేళ సమయంలో మీకేమైనా అనుమానాలు ఉంటే కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది

మీ దగ్గర ఉన్నది జాతకం ఏటువంటిదో తెలియకపోతే వాట్సప్ లో పంతులు గారికి పెట్టి సరిపోతుందా లేదా అని అడిగి అప్పుడు రావాలి 

4) జాతకం రాసి ఉన్నది కానీ చాలా రోజులు అయిపోయింది అండి, అది పనికొస్తుందా?
ఒకసారి జాతకం రాసిన తర్వాత జాతకం జీవితాంతం పనికి వస్తుంది జాతక చక్రం అనేది ఉంటుంది రాసి చక్రము నవాంశ చక్రము భావచక్రము దశలు అంతర్దశలో విదశలు కట్టేసి ఉంటాయి ఆ విధంగా ఉంటే దాన్ని జాతకం అంటారు

##మా దగ్గర ఇలా జాతకం ఉన్నది పనికొస్తుందా 






(పైన ఉన్న జాతక చక్రాలు జననపత్రికలు అంటారు జన్మ సమయమును నిర్ధారణ చేయడానికి మాత్రమే ఆధారపడతాయి మిగతా విషయాలు విశ్లేషణ చేసినప్పుడు కొన్ని అనుకూలిస్తుంటాయి కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. అవి కచ్చితంగా జరుగుతాయని చెప్పడం కష్టం. కారణం గ్రహాల మధ్య దూరం ఇందులో ఉండదు) 

ఉదాహరణకు 







ఇది రాసి చక్రం (అందులో గు,బు,శు,శ  గ్రహ దూరం తెలియదు నవాంశలో గాని ప్రత్యేక రాశిలో గానీ చూడాలి నవాంశలో కూడా చూసేటప్పుడు కొంత సమయ పట్టే అవకాశం ఉంటుంది, ప్రత్యేక రాశి చక్రం చాలా ముఖ్యం కింద విధంగా డిగ్రీలతో సహా దూరం తెలుస్తుంది )

ఇది ప్రత్యేక రాశి చక్రం గ్రహాల మధ్య దూరము తెలుసుకోవచ్చు 

పరాసరి జ్యోతిష్యం ప్రకారంగా 
క్రింది భావచక్రం ఉండాలి 



రాశి చక్ర ప్రకారంగా శ్రీపతి భావచక్రంలో పరిశీలన చేసినప్పుడు అనే అక్షరం మారింది అది గ్రహము బావము మారినట్టు, ఒక్కొక్కరికి అయితే రెండు మూడు గ్రహాలు కూడా మారిపోతూ ఉంటాయి  ఇలా గనక జాతక చక్రంలో ఒక్కొక్కరికి మారుతుంది ఒక్కొక్కరికి మారదు. ఈ విషయం రాసినప్పుడు మాత్రమే తెలుస్తుంది రాయకుండా పరిశీలన చేసినప్పుడు వాళ్లకు చెప్పవలసిన ఫలితాలు కూడా తారుమార  అయ్యే అవకాశాలుంటాయి 

కేపీ జాతక చక్ర ప్రకారం ప్లాసి ధర్స్ భావ చక్రం క్రింది విధంగా ఉంటుంది 

ఇంకా అత్యవసరమైన ఈ విధంగా కూడా కేపీ ప్రకారంగా వేసుకోవడం జరుగుతుంది


5) ఉద్యోగం, వివాహం ఆరోగ్యం ఇలాంటి చిన్న విషయాలన్నీ దానికి కూడా జాతకం అవసరమా?
జీవితంలో జరిగిన ఏ సంఘటనైనా సరే అది చాలా ముఖ్యమైనది దానివల్ల మనం బాధపడుతున్నాము అంటే అది చాలా దోషకరమైనది దోషం జాతక చక్రంలో ఏ గ్రహాల వల్ల వచ్చింది అని తెలుసుకోవాలంటే జాతకంలో చాలా ముఖ్యమైన చక్రం భావచక్రం అలాంటి భావచక్ర ప్రకారంగా దోషాలని గ్రహించి వాటికి సంబంధించిన పరిష్కారాలు చెప్పాలి తరువాత ఆ దోషం ఎప్పుడు వరకు ఉంటుంది తర్వాత మంచి ఏ విధంగా జరుగుతుంది అనేది మన తేదీల ప్రకారంగా చెప్పడం కోసం దశ అంతర్దశ విదశ అనే పట్టిక ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నప్పుడు వెంటనే చూపించుకోవచ్చు 

పైన చూపించినట్టుగా భావచక్రంలో గ్రహాలు మారిపోయినప్పుడు కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా ఫలితాలు మారిపోతుంటాయి అందుకనే అది గమనించాలి 

6) జాతకం లేకపోతే చూడడానికి అవ్వదా?
జాతకం లేకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క నామ నక్షత్ర ప్రకారంగా కొంత చెప్పడానికి అవకాశం ఉంది మరియు ఆ వ్యక్తి యొక్క సమస్యకు తగ్గ పరిష్కారం ప్రశ్న చక్రం చూపిస్తుంది. కావున అది చెప్పించుకోవచ్చు

7) జాతకం ఉండగా ప్రశ్న చక్రం చూసుకోవచ్చా జాతకం
,చూపించుకోకుండా?
ఆ విధంగా చూపించడం అనేది మంచి పద్ధతి కాదు కారణం జాతకంలోని ఆ అవకాశం ఉన్నది అని తెలిసిన తర్వాత అప్పుడు ప్రశ్న చక్రం వేసుకోవచ్చు అసలు మనకు జాతకమే తెలియనప్పుడు ప్రశ్న ద్వారా వెళ్లాలి జాతకం ఉన్నది అనుకుంటే జాతకం చూస్తూనే ప్రశ్న వేసుకోవాలి, పిల్లలకి భవిష్యత్తు సంబంధమైన విషయాలు కావున అశ్రద్ధగా మాత్రం మీరు ఉండకూడదు కొంత సమయాన్ని తీసుకుని డేటు టైము పుట్టిన స్థలం అని ఉన్నాయ్ అనుకుంటే ఈ జాతకం ద్వారానే వెళ్లాలి లేవు అనుకుంటే అప్పుడు పేరు లేదా ప్రశ్న ప్రకారంగా వెళ్లవచ్చును


8) జాతకం రాయించుకోవడానికి మేము ఏ విధంగా సంప్రదించాలి?
ఆఫీస్ దగ్గరికి వచ్చి జాతకాలు రాసే పుస్తకం అక్కడ వాళ్ళు ఇస్తారు పై అడిగిన వివరాలన్నీ దాంట్లో మెరెక్కించుకుని ఆ జాతకం కోడ్ అనేది ఉంటుంది అక్కడ అది ఎక్కించుకుని వెళ్లాలి వచ్చేముందు కోడ్ చెబితే రాసిన జాతకాలని ప్రింట్ తీసి ఉంచుతాం,

విధానం -: 1#

ఈ పేజీని ఎక్కించి పంపించవలసి ఉంటుంది 

2#ఫోన్ ద్వారా అయితే మంగళవారం పూట ఎక్కించడం జరుగుతుంది లేదా మిగతా రోజుల్లో మీరు ఆఫీసుకు వచ్చి కూడా ఎక్కించుకోవచ్చు ఒకవేళ మిగతా రోజుల్లో మీరు పంపించిన ఎక్కించడం జరుగుతుంది కాని ఒకవేళ మీకు నెంబర్ రాకపోతే మంగళవారం ఫోన్ చేయాలి 

3#వారంలో మీరు ఎప్పుడు ఎక్కించినా సరే మంగళవారం నుంచి మాత్రమే రాయడం జరుగుతుంది అలా ఎక్కించిన తర్వాత వారం రోజుల తర్వాత ఆ జాతకం పేపర్ ని వారం రోజుల తర్వాత వచ్చే మంగళవారం నాడు మాత్రమే ఈ నెంబర్ కి 9490131636 వాట్సాప్ పెట్టాలి మీ దగ్గర ఉన్న పైన రాసిన కాగితం 

4#రాయడం పూర్తయిన తర్వాత 
మీకు క్రింద విధంగా ఫోటో వస్తుంది , వాయిస్ మెసేజ్ కూడా వస్తుంది పుట్టిన తేదీ పుట్టిన సమయం (AM అంటే అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే సమయం, PM అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి అర్ధరాత్రి 12), పుట్టిన ప్రదేశం కూడా చూసుకోవాలి మీరు పుట్టిన ప్రదేశానికి దగ్గరగా ఉండే ప్రధాన నగరం ఉన్న సరిపోతుంది ,
ఆంగ్ల నామంలో స్వల్పమైన మార్పులు ఉన్నా  ఇబ్బంది లేదు


 

5# మీరు అన్ని చూసి ఓకే అన్న తర్వాత మీకు ఎప్పుడు రావాలనేది వాట్సప్  లో  
పంతులుగారు చెప్పిన సమయానికి 10 నిమిషాల ముందు కచ్చితంగా ఉండాలి లేదా ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది

6#జాతకం పేపర్ మీద ఎక్కించిన తర్వాత మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ముందుగానే చెప్పాలి జాతకం రాసిన తర్వాత గనక తప్పిదాలు చెప్పినప్పుడు అక్కడినుంచి మళ్ళీ వారం రోజుల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది 

7#ఉదాహరణ జాతకం ఏ విధంగా ఉంటుందో కిందని లింక్ ఇవ్వటం జరిగింది చూడవచ్చును 
https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:dfe20dbf-a75b-4a51-8f72-d5663d0e8f00


10) పిల్లలిద్దరికీ ఒకేసారి జాతకం రాయించుకోవచ్చా ?
జాతకం రాయించుకున్న తర్వాత వారికి చేసే పరిహారాలు ఒకే సంకల్పంతో చేయడం వల్ల ఆ పరిహారాలు వాళ్ళకి నెరవేరకపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఉద్యోగ వివాహానికి కలిపి గృహ యోగము సంతానానికి కలిపి, ప్రయాణం కోసం ,చదువు కోసం కలిపి, ఆకస్మికమైన ధనం ప్రభుత్వానికి కలిపి
అనారోగ్యం వివాహానికి కలిపి
ఇంటి నిర్మాణం వివాహానికి కలిపి ఇలా కలిపి సంకల్పం చెప్పుకునే వివిధ రకాలైన పూజలు చేయడం వల్ల ఏ పూజలు నెరవేరు ఎవరూ కూడా దాని ఫలితాన్ని పొందరు దాన్ని గమనించు మేము ఇద్దరికీ కూడా ఒక వారం వ్యవధి పెడుతున్నాం దాని వలన వీళ్ళు చేసే పూజల్లో సంకల్పాన్ని విడిగా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇది గమనించుకొని ఇద్దరికీ ఒకసారి మాత్రం రాయవద్దు

11) జాతక చక్రంలో అతి ముఖ్యమైనది పరాసరి జ్యోతిష్య విధానంలో శ్రీపతిబావ చక్రం ప్రకారంగా పరిశీలన చేయడం చాలా ముఖ్యం అది మీ దగ్గర ఉండాలి లేకపోతే పంతులు గారికి రాయడానికి సమయం ఇవ్వాలి. పైన చెప్పిన విధంగా
kp ఆస్ట్రాలజీ లో ప్లాషీదర్ భావ చక్రం చాలా ముఖ్యమైనది


12) పై వివరాలు పంతులు గారికి ఇచ్చి తగు సమయం ఇస్తే వివరంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని అత్యవసరమండి లేదంటే జాతక చక్రం రాయించుకుంటాం గానీ ముందుగా మాకు ఈ సమస్య చిన్న సమస్య నుండి అని ఆ సమస్య గురించి మీరు చిన్న పెద్ద నిర్ధారణ చేయకూడదు అది పంతులుగారికి కూడా తెలియదు ఆ సమస్య పరిశీలన చేసిన తర్వాత అప్పుడు చిన్న పెద్ద నిర్ధారణకు వచ్చి అతను దానికి తగ్గ పరిహారం చెబుతారు జాతకం చూడకుండా మాత్రం పరిహారాలు చేయకూడదు 


14) దూరప్రాంతాలు వాళ్లకి ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలంటే ఒక మంగళవారం రోజున మాత్రమే అవుతుంది (సోమవారం రాత్రి లోపున మెసేజ్ పెట్టవలసి ఉంటుంది)
8520000609 కి కాల్ చెయ్యాలి


...........................శుభం............................................


వివాహ పొంతన చూచుటకు కావలసిన వివరాలు
ఏమిటి?
13) అబ్బాయి - అమ్మాయి పెళ్ళి కి పొంతన చూడాలి ఏమీ అవసరం?
ఇద్దరిదీ 
పుట్టిన తేదీ -:
పుట్టిన సమయం -:
పుట్టిన స్థలం -:   
*ఇద్దరికీ ఖచ్చితముగా వుండాలి ,కాకుండా సర్టిఫికెట్ మీద కాకుండా, పుట్టిన తేదీని అంచనా పెట్టుకుంది తేదీలు ఏర్పాటు చేయకుండా
పండగల్లో పుట్టారు అని అంచనాలు చెప్పకూడదు
వెతికి వెతికి అనుమానంగా తేదీలు చెప్పకూడదు
వెతకమని బలవంతం చేయకూడదు
12) ఇద్దరి  లో ఒకరికి పుట్టిన తేది, పుట్టిన సమయం, పుట్టిన స్థలం ఒకరికి ఉన్నది?
ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే పూర్తిగా ఇద్దరిదీ పేరు బట్టి చూడడమే మంచిది. అంతేగాని ఇంకొకరిది వెతికి తెచ్చుకోవడం మంచిది కాదు అనుమానంతో చెప్పేది ఏది చెప్పి సమయం చెప్పలేదు సమయంలో చాలా ఎక్కువ తేడాతో చెప్పేది పుట్టిన స్థలం గురించి పూర్తిగా నిర్ధారణమైనది జాగ్రత్తగా చక్రం అంచనాగా వేసి చూసుకోవడం మంచిది కాదు











హనుమంతుడి సందేశం

హనుమంతుడి సందేశం ?






హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.

27* నక్షత్రాలు కు దాక్షారామం చుట్టూ ఉన్న శివ శక్తీ మందిరాలు


*27* నక్షత్రాలు మూలంగా ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.


అయితే , ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.
విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది

గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట .

మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం.


మేష రాశి

మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది.

అశ్విని నక్షత్రం

పాదం ———-స్థలం ——– దేవీ దేవతల నామాలు

మొదటి———బ్రహ్మపురి——-శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి

రెండవ ——- – ఉట్రుమిల్లి ——-శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి

మూడవ—— కుయ్యూరు శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

నాలుగవ దుగ్గుదూరు శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

భరణి నక్షత్రం

మొదటి——కోలంక———శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ——-ఎంజారం——-శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి

మూడవ——పల్లిపాలెం——శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

నాలుగవ——ఉప్పంగళ——-శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

కృత్తికా నక్షత్రం

మొదటి——-నేలపల్లి———శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.

వృషభ రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాసగంగావరం లో ఉన్నది.

కృత్తికా నక్షత్రం

రెండవ——అదంపల్లి——శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

మూడవ—–వట్రపూడి——శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ—–ఉండూరు——శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి

రోహిణీ

మొదటి—–తనుమల్ల——–శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

రెండవ——-కాజులూరు——-శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

మూడవ——ఐతపూడి——–శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

నాలుగవ —– చీల ———శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మృగశిర

మొదటి——–తాళ్ళరేవు——శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.

రెండవ———గురజానపల్లి——శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

మిధున రాశి.

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.

మృగశిర

మూడవ——– అంద్రగ్గి——-శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

నాలుగవ——–జగన్నాధగిరి—— శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

ఆరుద్ర

మొదటి——-పనుమళ్ళ——శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ——–గొల్లపాలెం——శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి

మూడవ—-వేములవాడ—–శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి

నాలుగవ——కూరాడ———-శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి

పునర్వసు

మొదటి——-గొర్రిపూడి (భీమలింగపాడు)—-శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి

రెండవ——–కరప———-శ్రీ పార్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మూడవ——ఆరట్లకట్ల—— శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి

కర్కాటక రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

పునర్వసు

నాలుగవ——యెనమాడల——–శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

పుష్యమి

మొదటి——–కాపవరం——-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

రెండవ———సిరిపురం——-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

మూడవ——-వేలంగి———-శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

నాలుగవ——–ఓడూరు——–శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

ఆశ్లేష

మొదటి——– దోమాడ——–శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి

రెండవ———పెదపూడి——-శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మూడవ——-గండ్రాడు——–శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ——-మామిడాడ——-శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీశ్రీ భీమేశ్వర స్వామి

సింహ రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

మఖ నక్షత్రం

మొదటి——నరసరావుపేట——శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

రెండవ——–మెల్లూరు————శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

మూడవ——అరికిరేవుల———-శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

నాలుగవ——కొత్తూరు————శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి

పుబ్బ నక్షత్రం

మొదటి——–చింతపల్లి———శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి

రెండవ———వెదురుపాక——శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి

మూడవ——–తొస్సిపూడి——-శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి

నాలుగవ——–పొలమూరు—–ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

ఉత్తర నక్షత్రం

మొదటి———-పందలపాక——–శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

కన్యా రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.

ఉత్తర నక్షత్రం

రెండవ———చోడవరం———శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి

మూడవ—–నదురుబాడు——–శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

నాలుగవ——పసలపూడి———శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు

హస్త

మొదటి——సోమేశ్వరం——–శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ——-పడపర్తి————శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు

మూడవ——పులగుర్త———–శ్రీ పార్వతీసమేత శ్రీ వీరేశ్వర స్వామి

నాలుగవ——మాచవరం——-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

చిత్త నక్షత్రం

మొదటి——-కొప్పవరం——–శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

రెండవ——–అర్థమూరు——-శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి

తుల రాశి

ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.

చిత్త నక్షత్రం

మూడవ——-చల్లూరు————శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

నాలుగవ——-కాలేరు——–శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

స్వాతి నక్షత్రం

మొదటి——–మారేడుబాక—శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి

రెండవ———మండపేట——శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి

మూడవ——-గుమ్మిలూరు—-శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

నాలుగవ——వెంటూరు——-శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

విశాఖ నక్షత్రం

మొదటి—–దూళ్ళ——-శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

రెండవ——నర్సిపూడి—-శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

మూడవ—–నవాబుపేట—-శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

వృశ్చిక రాశి

ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో వృశ్చికరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.

విశాఖ నక్షత్రం

నాలుగవ——-కూర్మపురం——శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

అనూరాధా నక్షత్రం

మొదటి——పనికేరు——–శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి

రెండవ——-చింతలూరు—–శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి

మూడవ—–పినపల్ల———శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

నాలుగవ—–పెదపల్ల——-శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

జ్యేష్టా నక్షత్రం

మొదటి——వడ్లమూరు——శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

రెండవ——–నల్లూరు———శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మూడవ——వెదురుమూడి—శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

నాలుగవ—– తేకి————–శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి

ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతి లోఉన్నది. నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్నాసమేత కాశివిశ్వేశ్వర స్వామికి అంకితం

మూల నక్షత్రం

మొదటి———యెండగండి——-శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ———-పామర్రు———–శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మూడవ——–అముజూరు——–శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ——–పానంగిపల్లి——–శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి

పూర్వాషాఢ

మొదటి———అంగర———–శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి

రెండవ———కోరుమిళ్ళ——–శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మూడవ——-కుళ్ళ————-శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ——-వాకతిప్ప——–శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి

ఉత్తరాషాఢ

మొదటి——-తాతపూడి———శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి

మకర రాశి

మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ఉత్తరాషాడ నక్షత్రం

రెండవ———మచర——–శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మూడవ——-సత్యవాడ——శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ——-సుందరపల్లి—-శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి

శ్రవణ నక్షత్రం

మొదటి——-వానపల్లి——-శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి

రెండవ——–మాదిపల్లి (మాడుపల్లి)— శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

మూడవ——వాడపాలెం——-శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి

నాలుగవ—— వీరపల్లిపాలెం—-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

ధనిష్ట

మొదటి——–వెల్వలపల్లి——-శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి

రెండవ———అయినవెల్లి——-శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

కుంభ రాశి

కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం లోఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ధనిష్ట

మూడవ——-మసకపల్లి——శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

నాలుగవ——-కుందూరు——శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

శతభష

మొదటి——–కోటిపల్లి———శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ——–కోటిపల్లి——– శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి

మూడవ——తొట్టరమూడి—–శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి

నాలుగవ——పాతకోట——–శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

పూర్వాభాద్ర

మొదటి——–ముక్తేశ్వరం—–శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

రెండవ———శాసనపల్లి లంక—-శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి

మూడవ——–తానెలంక———–శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి

మీన రాశి

మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.

పూర్వాభాద్ర

నాలుగవ———ఎర్రపోతవరం——శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

ఉత్తరాభాద్ర

మొదటి——-దంగేరు———–శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ——- కుడుపూరు——- శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

మూడవ——గుడిగళ్ళ———శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి

నాలుగవ—–శివల———–శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి

రేవతి

మొదటి—-భట్లపాలిక——-శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

రెండవ—–కాపులపాలెం—-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి

మూడవ—- పేకేరు———–శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

నాలుగవ—- బాలాంత్రం——శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

విశేష పూజలు








గణపతిపురం లో శివాలయం ప్రతిష్ట


చిన్న వంగలి గ్రామంలో రామాలయం ప్రతిష్ట పోటోలు 
http://ravitejasarma.blogspot.com/p/blog-page_5.html












రావులమ్మా పాలెం అంబాలాపూజ 

నవగ్రహ ప్రతిష్ట మరియు శివపార్వతుల కల్యాణం


శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ జైశ్రిరా


http://ravitejasarma.blogspot.com/p/blog-page_16.html

ప్రశస్తమైన 10 దానాలు

దశ (10) దానాలు అంటే ఇవి 


👉 గోదానం (ఆవులను దానం ఇవ్వడం)

👉 భూదానం, ( భూమిని దానంగా ఇవ్వడం)

👉 తిల దానం, ( నువ్వుల దానం)

👉 హిరణ్యదానం, (బంగారం దానం)

👉 ఆజ్య దానం, ( నెయ్యి దానం)

👉 వస్త్ర దానం, ( దుస్తుల దానం)

👉 ధాన్య దానం, ( ధాన్యం దానం)

👉 గుడ దానం, ( బెల్లం దానం)

👉 రౌప్య దానం (రౌప్యం అంటే రూప్యం. అంటే బంగారు లేదా వెండితో చేసిన నాణ్యం.)

👉 లవణ దానం ( ఉప్పు దానం) 

గోదానం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి?

అన్ని దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని
దగ్గరకు వెళ్లాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ
వృత్తాంతాన్ని వివరించాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో
తెలుసుకోవచ్చు.

కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞ
జపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ
తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ
తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగడంతో అవి న‌దీ
గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు.
అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో
వున్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో
నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శ‌పించాడు. తండ్రి ఆజ్ఞను
పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి
వెళ్లిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా
రోదించాడు. సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది.
పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు
వెళ్లింది వెల్లడించమన్నాడు.

నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు.
ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చ‌నిపొమ్మ‌ని శాపం
ఇవ్వలేదు కనుక నాచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు
చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు
చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం
నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్న‌ట్టు అతను తెలిపాడు. అనంతరం
పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు
వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు
గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.

శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ.. మూడు
రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను
దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. చిన్న వయస్సులో మంచి
ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని
సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు
తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు. ఈ కథ ద్వారా గోదానం ఎంత
గొప్పదో తెలుసుకోవచ్చు


షష్ఠి దేవి స్తోత్రం.

షష్ఠి దేవి స్తోత్రం.




నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః

శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః

వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః

సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః

సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః

మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః

సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః

బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః

కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం

ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః

పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః

శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః

ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః 

దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః

నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః