Sunday, March 30, 2025

ఉగాది పంచాంగ శ్రవణ విశేషం

్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
----------------------------------------
ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.       అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.
అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.
అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.
ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. 
ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.
----------------------------------------
ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు.
కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.
అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
-----------------------------------
*పురాణ గాథ!*
-------------------------------------
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు  శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు.
దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు.
అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు.
వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట.
నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.        ----------------------------------
       *ఉగాది పండుగ*
----------------------------------- *కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే! ఆనందమే! ఇట్టి పవిత్రవిశాల భావన లేకుండా ఆచరించే పండుగలు దండుగలే అవుతాయి. పిండివంటలూ, మధురపదార్ధాలూ తిని, రజస్తమోగుణాలు నింపుకోవడం తప్ప - సాత్త్విక ప్రవృత్తి లభించదు. కనుకనే మనపూర్వులు ప్రతిపండుగకూ ఒక అధిష్ఠానదైవం, పూజ, నియమాలూ, ఆహార విశేషాలూ ఏర్పాటు చేసినారు. పవిత్రభావంతో చేసే ప్రతి కార్యమూ ఇహపర ఆనందదాయకమే అవుతుంది.*
--------------------------------------       *''ఉగాది'' ప్రత్యేకించి - ఇతర వ్రతాలూ, పండుగల వలె ఏదో వొక దేవతను ఉద్దేశించి చేసేది కాదు. ఆనంతమైన కాలాన్ని - మన సౌలభ్యగణనం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి, సంవత్సరాదినాడు కాలాన్ని మన ఇష్ట దైవస్వరూపంగానూ, సకల దేవతా స్వరూపం గానూ భావించి, సంవత్సరకాల భవిష్యత్తును ముందుగా తెలుసుకొని ఆయా సమయాల్లో దైవానుగ్రహ ప్రాప్తికై చేయాల్సిన సాధనాలను సిద్ధపరచుకొనే ఒక చక్కని శాస్త్రీయ ప్రణాళికకు పూర్వరంగం ఏర్పరచుకోవడం ఉగాది విశిష్టత.*
---------------------------------------  *కాలగణనంలో ఒకప్పుడు మార్గశిరంతోనూ, వైశాఖంతోనూ, కార్తికంతోనూ, ఆశ్వయుజంతోనూ ఇలా అనేకవిధాలుగా సంవత్సరం ప్రారంభమైన విశేషాలు మనవాఙ్మయంలో కన్పిస్తున్నాయి. అట్లే యుగ ప్రారంభ తిథి విషయంలోనూ కల్ప, మన్వంతరాది భేదాన్నిబట్టి తేడాలున్నాయి. నక్షత్రాలను కూడా యుగాది నక్షత్రాలుగా పేర్కొన్నారు.*
  -------------------------------------          *వరహమిహిరాచార్యుని నిర్ణయాన్నిబట్టి, మనం చాంద్రమానం రీత్యా చైత్రమాసాన్నే సంవత్సరారంభంగా భావించి, చైత్ర శుక్ల ప్రతిపత్తు (పాడ్యమి) నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించినాడన్న శాస్త్రవాక్కును ప్రమాణంగా గైకొని, దీన్నే ''యుగాది''గా గణించి, ఉగాది పండుగను ఆచరిస్తున్నాము. ప్రతి దేశంలోనివారూ, రాష్ట్రంలోనివారూ ఏదోవొక కాలగణనంతో ఉగాది పండుగను తమ సంప్రదాయం ప్రకారం జరుపుకొంటూనే ఉన్నారు. ఆచరించే విధానంలో తేడా వున్నా ఆశయంలో, ఆనందంలో మాత్రం తేడాలేదు.*
-------------------------------------    *తెలుగువారేకాక, కర్ణాటకులు, మహారాష్ట్రులు, చాంద్రమానాన్ని అనుసరించే మాళవీయులు మున్నగు వారు,రునూ ఉగాది పండుగను చైత్ర శుక్ల పాడ్యమినాడే ఆచరిస్తున్నారు.*
-------------------------------------
*మనం జీవిస్తున్న ఈసృష్టి జరిగిన రోజును పండుగగా మనం పుట్టినరోజును పండుగగా జరుపుకొంటున్నట్లుగా భావించి, ఈ ఉగాది పండుగను ఆనందంతో సంవత్సరంలో తొలిపండుగగా జరుపు కొంటున్నాము. జరుపుకోవాలి కూడా!*
--------------------------------------
*సూర్యోదయానికి పాడ్యమి ఉన్న రోజునే (చైత్రశుక్ల పాడ్యమి) ఈ పండుగను ఆచరించాలి.*
---------------------------------------
*"చైత్రేమాసి" జగద్ర్బహ్మా ససర్జ ప్రథమేsహని*

*శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి"*
---------------------------------------        *అని హేమాద్రి నిర్ణయం! కనుక చైత్రశుద్ధపాడ్యమి సంవత్సరాది. ఉదయానికి పాడ్యమి ఉండాలి. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధపాడ్యమి, సూర్యోదయవేళ ఈ సృష్టిని సమగ్రంగా చేసినాడు. అందుకు కృతజ్ఞతాసూచకంగా, జ్ఞాపక చిహ్నంగా యుగాది పండుగ జరుపుకొంటున్నాము.*
------------------------------------         
*చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉపవాస ముండి, బ్రహ్మను పూజించినవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు. ఒకవేళ చైత్రం అధికమాసంగా వస్తే, అధికమాస ప్రారంభంనాడే ఉగాది జరుపుకోవాలి. అంతేకాని నిజచైత్రారంభంలో కాదు.*
-------------------------------------