Saturday, August 31, 2019

శ్రీ గర్భరక్షా స్తోత్రం


శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం:

ఓం శ్రీ గణేశాయ నమః   
ఓం శ్రీమాత్రే నమః
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II

స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ  ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II

రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II
        

పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం చదువుకోవాలి. పిల్లలు లేని వారికి గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది.ఎప్పుడూ ఎవరికీ గర్భస్రావం కావడం, పిల్లలు కలుగక పోవడం అనే సమస్య లేదు.

Thursday, August 29, 2019

శ్రీ భూ వరాహ స్తోత్రం.


శ్రీ భూ వరాహ స్తోత్రం

ఋషయ ఊచు |

జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||

దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||

సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||

నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||

త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||

కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||

విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||

స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం..!

Wednesday, August 14, 2019

శ్రావణపౌర్ణమి ,హయగ్రీవజయంతి - విశిష్టత🌼🌿


🌿 శ్రావణపౌర్ణమి ,హయగ్రీవజయంతి -విశిష్టత🌿

శ్రావణ పౌర్ణమి , జంధ్యాలపౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీమహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించడం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి . 
జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రిదేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. శ్రావణపూర్ణిమ నాడు ఉపాకర్మ చేస్తారు. అంటే కొత్తగా ఉపనయనం అయినవారికి ప్రత్యేక హోమం,పూజలతో చేసే కార్యక్రమం.

హయగ్రీవజయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామా!
                  హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
                  ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట! ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయన్నది పెద్దల మాట.

హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ, ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా!

హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యంకాదు కాబట్టి... కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం-

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
... అనే మంత్రాన్ని పఠించాలి. హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి, ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.

            ఇంతకుముందు చెప్పుకొన్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఈ రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటులేకుండా ఉంటుంది. మరెందుకాలస్యం! ఈ హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మీ మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి.

Tuesday, August 6, 2019

దేవాలయాలు సమాచారం కొరకు



✍ మీరు తెల్సుకోదలచిన క్షేత్రం ఎదురుగా ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే క్షణాలలో సమాచారం ఓపెన్ అవుతుంది . ఆ క్షేత్రాలకు సంబందించిన పూర్తిసమాచారం ఇవ్వబడింది . 


మీరు షేర్ చేస్తే ఆ క్షేత్రాలకు వెళ్లబోయే భక్తులకు మీరు ఉపకారం చేసినవారు అవుతారు .

 

తిరుమల :  https://goo.gl/LHwnpS

అరుణాచలం :  https://goo.gl/YKQFt5

వారణాసి :  https://goo.gl/7551ZC

కాంచీపురం :  https://goo.gl/9U11rh

శ్రీశైలం వెళ్లేముందు తెలుసుకోండి :  https://goo.gl/h4NJZH

భారతదేశం లో ఎత్తైన 10 గోపురాలు :  https://goo.gl/G9GHdy

షిర్డీ :  https://goo.gl/WFbNcs

శ్రీకాళహస్తి :  https://goo.gl/PXJv9Q

రామేశ్వరం :  https://goo.gl/uXffLV

తెలంగాణ అమర్నాథ్ :  https://goo.gl/ihJV4M

ఆశ్చర్య పరచే బృహదీశ్వర ఆలయం :  https://goo.gl/tCTYbW

శ్రీరంగం భూలోక వైకుంఠం :  https://goo.gl/fPWdos

మదురై :  https://goo.gl/yV6R7E

భద్రాచలం :  https://goo.gl/X3rDb3

అన్నవరం :  https://goo.gl/bdJYeD

పిఠాపురం :  https://goo.gl/ezR4Cs

ఈ తిరుపతి గురించి తెలుసా ? :  https://goo.gl/WsSYF9

ద్రాక్షారామం శక్తిపీఠం & పంచారామ క్షేత్రం  :  https://goo.gl/BBRSqV

5000 సంవత్సరాలు కలిగిన సర్పవరం :  https://goo.gl/UbQH8T

సామర్లకోట పంచారామ క్షేత్రం :  https://goo.gl/E6gdQc

పూజ ఏ విధంగా చెయ్యాలి :  https://goo.gl/mQwFww

చిదంబరం క్షేత్రం :  https://goo.gl/CQqjr2

శ్రీలంక లో ఉన్న శక్తి పీఠం :  https://goo.gl/dCecSa

కొల్హాపూర్ మహాలక్ష్మి :  https://goo.gl/tM2EXG

యాగంటి :  https://goo.gl/XkN7zz

కాణిపాకం :  https://goo.gl/Yb2871

జంబుకేశ్వరం లో మీరు గమనించారా ? :   https://goo.gl/5Lk6wR

సింహాచలం : https://goo.gl/ZUYdKd

ఈ లాంటి శైవ  క్షేత్రాలు ఉన్నాయని మీకు తెలుసా ? :  https://goo.gl/6xhEus

మనము తెలుసుకోవలసిన విషయాలు

పంచగము,పురాణలు,ధర్మగ్రంథాలు అన్ని
పరిశీలించి పంతులుగారు నిర్ణయం చేసి 
చేబుతారు కావున మా చుట్టుపక్కల వాళ్ళు
ఇలా చేశారు,ఇంటిలో వాళ్ళు అలా చేబుతున్నారు 
అని పంతులుగారు ని తప్పుతోవ పట్టించారాదు
ఆలోచించి మీ పేరు బలమునకు సరి పోయిన
ముహూర్తం పంతులుగారు ఇచ్చింది ఆచరించుట చాలా మంచిది 



1.ముఖ్యముగా మగపిల్లలు  అన్నప్రాసన, 
పుట్టజుట్టులు 6,8,10,12  నెలలో  చెయ్యాలి

2.ముఖ్యముగా ఆడపిల్లలు  అన్నప్రాసన, 
పుట్టజుట్టులు 7,9,11 నెలలో  చెయ్యాలి

3. గర్భిణి స్త్రీలని పురుటీకి పంపించుటకు
7,9  నెలలో  అమ్మగారింటికి పంపించాలి
తల్లిని,పిల్లని(పురటాలని) అత్తవారింట్లో అడుగు పెట్టకు 1,3,5,9 నెలలు మంచివి
(శూన్యమాసం అయిన,మూడమి అయిన,పుష్యం,
అషాడం,భాద్రపదం, నెలగంట అయిన పంపవచ్చును)
నెలలు ప్రకారము చెయ్యేదానికి పైన మాసములు దోషం లేదు కావున 

4. సంవత్సరాలలోపు కొత్త ఇంటిలో దిగ మంటున్నారు 
 

ఇల్లు ప్రారంభం చేసిన మొదటి సంవత్సరంలోనే ఇంటిలో దిగాలి అని  శాస్త్ర ప్రకారం గా ఎక్కడా లేదు
 ఎక్కవ సంవత్సరములు నిర్మాణం చేయకూడదని మాత్రమే ఉన్నది, అదేవిధంగా ద్వారా రోహణ ,స్లాబు, తలుపులు, గుమ్మడికాయ కొట్టకుండా ప్రవేశం చేయకూడదు, మరల గృహప్రవేశం చేసిన తర్వాత కూడా దేవుని కదిపి ఎక్కువకాలం గృహ లోపల భాగం లో కొంత పని ఉంచి గృహప్రవేశం చేసుకోవడము అంటే గృహ వెలుపల ఉంచుకొని ప్రవేశం చేయాలి కావున శంకుస్థాపన చేసిన యజమాని పేరున ముహూర్తబలం ఎప్పుడు ఉంటే అప్పుడే ప్రవేశం చేయాలి గాని ఇన్ని రోజుల లోపల చెయ్యాలి అనేది ఎక్కడా కూడా లేదు 

 మంచి ముహూర్తం పంతులుగారు ని అడిగి తీసుకుని వెల్లవచ్చును

స్త్రీలు చేయకూడని పనులు

గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.

మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.



మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు.

స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు.
ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.

కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమి నాసిని.

ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.


నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.

ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు ,కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.

ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.

అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.

టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.

స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.

శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.

కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.

ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.

సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.

స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.

ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.

ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.

శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను