Saturday, January 23, 2021

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం



వీడియో లింక్ -: https://youtu.be/Fp8wGtN8_0Y?feature=shared

శ్రీ దేవీ ప్రార్థన

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం ‖

ఓం నమస్త్రిపురసుందరీ,
హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ,
కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే,
పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ,
కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ,
విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ,
అణిమాసిద్ధే, లఘ్మాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘనివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,

శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,
మహామహేశ్వరీ, మహామహారాజ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః |

ఫలశ్రుతిః

ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః |
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ‖

లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ‖

అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ‖

మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ‖

తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ‖

సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ‖

ఏకవారం జపధ్యానం సర్వపూజాఫలం లభేత్ |
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ‖

ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ‖

లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరం ‖

అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనం |
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకం ‖

మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితం |
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ ‖

తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదం ‖

‖ ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తం ‖





Saturday, January 9, 2021

ఆకాశదీప మహాత్మ్యం

ఆకాశదీప మహాత్మ్యం

🌟కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేనితో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. 

🌟 ఉత్‌ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, దామోదరమావాహయామి అనిగాని, త్రయంబకమావాహయామ అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.

🌟 కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః
ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు 'కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః' కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు.

🌟 అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.

🌟 అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ, కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసి కొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా ! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే ! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే ! అది అభ్యున్నతిని పొందాలి.

🌟 నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు, కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక ! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక ! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక ! కాబట్టి *భవంతిత్వం స్వపచాహివిప్రా ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.

🌟 అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.

 

దీపారాధన ఫలితాలు


'జ్ఞాన దీపం'


🌺 చిమ్మచీకట్లో నడుస్తున్నప్పుడు దారి కనిపించదు. అప్పుడే దీపం అవసరమేమిటో గుర్తుకొస్తుంది. అలాగే జీవితం అంధకారమయంగా మారినప్పుడు దిక్కు తోచదు. ఎటువెళ్లాలో ఒక పట్టాన తెలియదు. ఏ ఆలోచనా తట్టదు. అప్పుడూ దీపమే కావాలి. హృదయంలో వెలిగే దీపమది. అదే 'జ్ఞాన దీపం'!

🌺 లోకంలో భౌతికంగా కాంతులీనే దీపాలకు ఆది, అంతం ఉంటాయి. మనిషిలో అంతర్లీనంగా వెలిగే దీపానికి ముగింపు ఉండదు. అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.

🌺 పగలు, రాత్రి- సుఖదుఃఖాలకు ప్రతీకలు. సుఖం కలిగినప్పుడు సంతోషించడం, అది లేనప్పుడు దుఃఖించడం అతి సామాన్యులు చేసే పని. ప్రాజ్ఞులు అలా కాదు. సుఖదుఃఖాల్లోనూ ఒకే తీరుతో (ఆనందం) వ్యవహరిస్తారు. జ్ఞానసిద్ధి పొందినవారిని ‘బుద్ధుడు’ అంటారు. అతడు ఎప్పుడూ వెలుగులోనే ఉంటాడు. చీకటి అతడి దరి చేరదు. అజ్ఞానం అంటే, చీకటి. జ్ఞానం అంటే, వెలుగు. వెలుగు ఉన్నచోట చీకటికి తావు లేదు. అజ్ఞానం వల్లనే దుఃఖం కలుగుతుంది. జ్ఞానంతో అది తొలగిపోతుంది.

🌺 చీకటి వెలుగులు- ప్రకృతి సహజాతాలు. అవి వస్తాయి, పోతాయి. కేవలం ప్రాకృతిక వెలుగు మీదనే ఆధారపడితే, పరాధీనులై మిగిలిపోతారు. సహజమైన వెలుగు వచ్చేంతవరకు, వారు చీకట్లో జీవనం గడపాల్సి వస్తుంది. మనిషి తానే ఒక వెలుగైతే, స్వతంత్రుడిగా మారతాడు. జ్ఞానం పట్ల ప్రేమ పెంచుకోవడం వల్లనే, మానవుడు విద్యుద్దీపాన్ని కనుగొన్నాడు.

🌺 జ్ఞానం అనేది రెండు ముఖాలున్న నాణెం వంటిది. ఒక ముఖంతో బయటకు చూస్తే, విజ్ఞాన ఫలితంగా కొత్తవాటిని కనిపెట్టే శాస్త్రవేత్త అవుతాడు. మరో ముఖంతో లోపలికి చూసుకుంటే, జీవన రహస్యాలు విప్పిచెప్పగల తత్వవేత్తగా ఉంటాడు. అందువల్లే పశ్చిమ దేశాలు వైజ్ఞానికంగా ఎదిగాయి. భరతఖండం ఆధ్యాత్మిక శిఖరంగా ఉన్నతీకరణ చెందింది. ప్రపంచం దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.

🌺 అజ్ఞానం అనే చీకటి వల్లే అరిషడ్వర్గాలు మనసులోకి చేరతాయి. అల్లకల్లోలాన్ని, గందరగోళాన్ని అవి సృష్టిస్తాయి. ఫలితంగా మనసు దుఃఖానికి లోనవుతుంది.

🌺 చీకటి తొలగాలంటే వెలుగు కావాలి. జ్ఞానం వెలుగుతున్న దీపం వంటిది. ‘ఇంట్లో దీపం వెలుగుతుంటే, అక్కడికి ఏ దొంగా వెళ్లడు’ అని గౌతమ బుద్ధుడు బోధించేవారు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి విషయంలోనూ అంతే! ‘లోపలి దీపం’ వెలిగించుకున్న మనిషి మనసులోకి అరిషడ్వర్గాలకు చెందిన ఏ చోరుడూ ప్రవేశించలేడు.

🌺 గాలి వీస్తున్నప్పుడు దీపం వెలగదు. పరిపరి విధాలుగా సంచరించే మనసు, వీచే గాలి వంటిది. అలాంటి నిలకడ లేని మనసులో ఆత్మజ్యోతి ప్రకాశించదు. ధ్యాన సాధనతో మనసును ఉన్నతీకరించుకోవాలి. మానవ జీవితం పెట్టుబడి వంటిది. దానికి రాబడి- లోపలి దీపం వెలగడమే!!

దీపారాధన చేయడానికి ఏ నూనెను ఉపయోగించాలి?

🌹 హిందువులు పూజ చేసే సమయంలో దీపారాధన చేస్తూ ఉంటారు ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మనలో దాగిఉన్న దైవిక శక్తి మేల్కొంటుంది అలాగే శారీరక మానసిక బలం కూడా కలుగుతుంది దీపం పెట్టి దైవాన్ని ప్రార్ధిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. 

🌹 అయితే దీపారాధన చేసినప్పుడు ఏ నూనె వాడాలి అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అలాగే ఏ ఒత్తి వెలిగిస్తే శుభాలు కలుగుతాయి తెలుసుకుందాం.

🌹 తామర కాడ తో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి. తెల్లటి వస్త్రం మీద పన్నీరు జల్లి ఆరబెట్టి ఆ తర్వాత ఆ వస్త్రంతో వత్తులు చేసి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన శనీశ్వరునికి శుభం. 

🌹 వేప నూనె విప్ప నూనె ఆవు నెయ్యి తో దీపారాధన చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆవు నెయ్యి విప్ప, వేప ఆముదం కొబ్బరి నూనె మిశ్రమంతో నలభై ఒక్క రోజుల దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వినాయకునికి నువ్వుల నూనె దీపం, లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం పెడితే మంచిది. దీపం వెలిగించే టప్పుడు దీపం కింద తమలపాకు లేదా ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి. 

దీపారాధన ఫలితాలు

దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః
దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః

దీపం పర బ్రహ్మ స్వరూపం. పరాయణత్వం కలిగిందై. పాప ప్రక్షాళన చేయును. మన ఇంట సిరులు ఇచేది దీపజ్యోతియే ! అట్టి దీపదేవికి నమస్కరిస్తున్నాను.

దీపం జ్ఞానానికి చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయంసంధ్యవేళ ఒకటి, రెండుసార్లు దీపారాధన చేయడం హిందూవుల ఆచారం. ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని "అఖండ" దీపం అంటాము. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుందంటున్నారు పెద్దలు. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాము. సంప్రదాయబద్దంగా వెలిగించే నూనే దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లెదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి.

రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.అలాగే రకరకాల గుళ్ళల్లలోనూ కూడ దీపారాధన కు ఉపయోగించేవారు. ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి వచ్చేసాయి.ఆర్ధికంగా ఉన్నవారు స్వర్ణదీపాలు, నవరత్నములు పొదిగిన దీపాల సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.

దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి.

మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను "వ్యష్టి " దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి, ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసంపద కలిగించేది ....అలాగే దేవాలయాలలో చేసే దీపారధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది...విశే ష ఫలితాలు .

తులసి కోట వద్ద చేసే దీపారాధనని " బృందావన" దీపారాధన అంటారు. దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను "అర్చనా" దీపాలు అంటారు.

నిత్య పూజలలో ఉపయోగించే చిరుదీపాలను నిరంజన దీపాలంటారు. గర్భగుడిలో వెలిగించే దీపాన్ని "నందా" దీపము అని అంటారు. లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో గుడిలో వెలిగించే దీపాన్ని "లక్ష్మి దీపం" అంటారు.

దేవాలయ ప్రంగణములొనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా "బలిదీపం" అని అంటారు. ఆ సమీపాన ఉన్న ఎత్తూయిన స్థంబం పై వెలిగించిన దీపాన్ని "ఆకాశదీపం" అంటారు.

పంచాయతన దేవాలయాలలో దేవతలు.. శివుడు, విష్ణువు, అంబిక, గణపతి, ఆదిత్యుడు(సూర్యుడు) లున్న ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారధనకు వివిధ పేర్లు ఉన్నాయి. శైవరూపంలో నందిరూపంగా, నాగరూపంలో మేళవించిన దీపాలు కనిపిస్తాయి.

విష్ణువు వద్ద దీపకృతులు :శంఖు,చక్ర,గద,పద్మ"రూపాలు కనిపిస్తాయి.

ఏక ముఖం- మధ్యమం, ద్విముఖం - కుటుంబ ఐక్యత, త్రిముఖం-ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం -పశుసంపద మరియు ధన సంపద, పంచముఖం సిరిసంపదుల వృద్ధి ఫలితములు ఉండును.

అలాగే మట్టి, వెండి పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం.

వెండి కుందులు అగ్రస్థానం . పంచ లోహపు కుందులు ద్వితియ స్థనం.

దీపారాధన చేసే తప్పుడు తప్పనసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద మరో ప్రమిద పెట్టాలి.

ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాలలో తప్పనసరిగ చెయ్యాలి. నిత్యం శుభఫలితాలను ఇస్తు, దుష్ట శక్తులు నశిస్తాయి. ఆ ఇంటా అందరు క్షేమముగా ఉంటారు.

దీపం వెలించడానికి ఒక వత్తి ఉపయోగించరాదు. ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం.దీపారాధనకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. అగ్గిపుల్లతో దీపం వెలిగించారాదు. అగరబత్తీల ద్వారా వెలిగించవచ్చు. దీపం కొండెక్కితే "ఓమ్ నమః శివాయ" అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు.

దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.

దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి. 


సేకరణ 
రవితేజశర్మ