Saturday, January 9, 2021

దీపారాధన ఫలితాలు


'జ్ఞాన దీపం'


🌺 చిమ్మచీకట్లో నడుస్తున్నప్పుడు దారి కనిపించదు. అప్పుడే దీపం అవసరమేమిటో గుర్తుకొస్తుంది. అలాగే జీవితం అంధకారమయంగా మారినప్పుడు దిక్కు తోచదు. ఎటువెళ్లాలో ఒక పట్టాన తెలియదు. ఏ ఆలోచనా తట్టదు. అప్పుడూ దీపమే కావాలి. హృదయంలో వెలిగే దీపమది. అదే 'జ్ఞాన దీపం'!

🌺 లోకంలో భౌతికంగా కాంతులీనే దీపాలకు ఆది, అంతం ఉంటాయి. మనిషిలో అంతర్లీనంగా వెలిగే దీపానికి ముగింపు ఉండదు. అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.

🌺 పగలు, రాత్రి- సుఖదుఃఖాలకు ప్రతీకలు. సుఖం కలిగినప్పుడు సంతోషించడం, అది లేనప్పుడు దుఃఖించడం అతి సామాన్యులు చేసే పని. ప్రాజ్ఞులు అలా కాదు. సుఖదుఃఖాల్లోనూ ఒకే తీరుతో (ఆనందం) వ్యవహరిస్తారు. జ్ఞానసిద్ధి పొందినవారిని ‘బుద్ధుడు’ అంటారు. అతడు ఎప్పుడూ వెలుగులోనే ఉంటాడు. చీకటి అతడి దరి చేరదు. అజ్ఞానం అంటే, చీకటి. జ్ఞానం అంటే, వెలుగు. వెలుగు ఉన్నచోట చీకటికి తావు లేదు. అజ్ఞానం వల్లనే దుఃఖం కలుగుతుంది. జ్ఞానంతో అది తొలగిపోతుంది.

🌺 చీకటి వెలుగులు- ప్రకృతి సహజాతాలు. అవి వస్తాయి, పోతాయి. కేవలం ప్రాకృతిక వెలుగు మీదనే ఆధారపడితే, పరాధీనులై మిగిలిపోతారు. సహజమైన వెలుగు వచ్చేంతవరకు, వారు చీకట్లో జీవనం గడపాల్సి వస్తుంది. మనిషి తానే ఒక వెలుగైతే, స్వతంత్రుడిగా మారతాడు. జ్ఞానం పట్ల ప్రేమ పెంచుకోవడం వల్లనే, మానవుడు విద్యుద్దీపాన్ని కనుగొన్నాడు.

🌺 జ్ఞానం అనేది రెండు ముఖాలున్న నాణెం వంటిది. ఒక ముఖంతో బయటకు చూస్తే, విజ్ఞాన ఫలితంగా కొత్తవాటిని కనిపెట్టే శాస్త్రవేత్త అవుతాడు. మరో ముఖంతో లోపలికి చూసుకుంటే, జీవన రహస్యాలు విప్పిచెప్పగల తత్వవేత్తగా ఉంటాడు. అందువల్లే పశ్చిమ దేశాలు వైజ్ఞానికంగా ఎదిగాయి. భరతఖండం ఆధ్యాత్మిక శిఖరంగా ఉన్నతీకరణ చెందింది. ప్రపంచం దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.

🌺 అజ్ఞానం అనే చీకటి వల్లే అరిషడ్వర్గాలు మనసులోకి చేరతాయి. అల్లకల్లోలాన్ని, గందరగోళాన్ని అవి సృష్టిస్తాయి. ఫలితంగా మనసు దుఃఖానికి లోనవుతుంది.

🌺 చీకటి తొలగాలంటే వెలుగు కావాలి. జ్ఞానం వెలుగుతున్న దీపం వంటిది. ‘ఇంట్లో దీపం వెలుగుతుంటే, అక్కడికి ఏ దొంగా వెళ్లడు’ అని గౌతమ బుద్ధుడు బోధించేవారు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి విషయంలోనూ అంతే! ‘లోపలి దీపం’ వెలిగించుకున్న మనిషి మనసులోకి అరిషడ్వర్గాలకు చెందిన ఏ చోరుడూ ప్రవేశించలేడు.

🌺 గాలి వీస్తున్నప్పుడు దీపం వెలగదు. పరిపరి విధాలుగా సంచరించే మనసు, వీచే గాలి వంటిది. అలాంటి నిలకడ లేని మనసులో ఆత్మజ్యోతి ప్రకాశించదు. ధ్యాన సాధనతో మనసును ఉన్నతీకరించుకోవాలి. మానవ జీవితం పెట్టుబడి వంటిది. దానికి రాబడి- లోపలి దీపం వెలగడమే!!

దీపారాధన చేయడానికి ఏ నూనెను ఉపయోగించాలి?

🌹 హిందువులు పూజ చేసే సమయంలో దీపారాధన చేస్తూ ఉంటారు ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మనలో దాగిఉన్న దైవిక శక్తి మేల్కొంటుంది అలాగే శారీరక మానసిక బలం కూడా కలుగుతుంది దీపం పెట్టి దైవాన్ని ప్రార్ధిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. 

🌹 అయితే దీపారాధన చేసినప్పుడు ఏ నూనె వాడాలి అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అలాగే ఏ ఒత్తి వెలిగిస్తే శుభాలు కలుగుతాయి తెలుసుకుందాం.

🌹 తామర కాడ తో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి. తెల్లటి వస్త్రం మీద పన్నీరు జల్లి ఆరబెట్టి ఆ తర్వాత ఆ వస్త్రంతో వత్తులు చేసి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన శనీశ్వరునికి శుభం. 

🌹 వేప నూనె విప్ప నూనె ఆవు నెయ్యి తో దీపారాధన చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆవు నెయ్యి విప్ప, వేప ఆముదం కొబ్బరి నూనె మిశ్రమంతో నలభై ఒక్క రోజుల దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వినాయకునికి నువ్వుల నూనె దీపం, లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం పెడితే మంచిది. దీపం వెలిగించే టప్పుడు దీపం కింద తమలపాకు లేదా ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి. 

దీపారాధన ఫలితాలు

దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః
దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః

దీపం పర బ్రహ్మ స్వరూపం. పరాయణత్వం కలిగిందై. పాప ప్రక్షాళన చేయును. మన ఇంట సిరులు ఇచేది దీపజ్యోతియే ! అట్టి దీపదేవికి నమస్కరిస్తున్నాను.

దీపం జ్ఞానానికి చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయంసంధ్యవేళ ఒకటి, రెండుసార్లు దీపారాధన చేయడం హిందూవుల ఆచారం. ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని "అఖండ" దీపం అంటాము. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుందంటున్నారు పెద్దలు. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాము. సంప్రదాయబద్దంగా వెలిగించే నూనే దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లెదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి.

రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.అలాగే రకరకాల గుళ్ళల్లలోనూ కూడ దీపారాధన కు ఉపయోగించేవారు. ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి వచ్చేసాయి.ఆర్ధికంగా ఉన్నవారు స్వర్ణదీపాలు, నవరత్నములు పొదిగిన దీపాల సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.

దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి.

మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను "వ్యష్టి " దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి, ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసంపద కలిగించేది ....అలాగే దేవాలయాలలో చేసే దీపారధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది...విశే ష ఫలితాలు .

తులసి కోట వద్ద చేసే దీపారాధనని " బృందావన" దీపారాధన అంటారు. దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను "అర్చనా" దీపాలు అంటారు.

నిత్య పూజలలో ఉపయోగించే చిరుదీపాలను నిరంజన దీపాలంటారు. గర్భగుడిలో వెలిగించే దీపాన్ని "నందా" దీపము అని అంటారు. లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో గుడిలో వెలిగించే దీపాన్ని "లక్ష్మి దీపం" అంటారు.

దేవాలయ ప్రంగణములొనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా "బలిదీపం" అని అంటారు. ఆ సమీపాన ఉన్న ఎత్తూయిన స్థంబం పై వెలిగించిన దీపాన్ని "ఆకాశదీపం" అంటారు.

పంచాయతన దేవాలయాలలో దేవతలు.. శివుడు, విష్ణువు, అంబిక, గణపతి, ఆదిత్యుడు(సూర్యుడు) లున్న ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారధనకు వివిధ పేర్లు ఉన్నాయి. శైవరూపంలో నందిరూపంగా, నాగరూపంలో మేళవించిన దీపాలు కనిపిస్తాయి.

విష్ణువు వద్ద దీపకృతులు :శంఖు,చక్ర,గద,పద్మ"రూపాలు కనిపిస్తాయి.

ఏక ముఖం- మధ్యమం, ద్విముఖం - కుటుంబ ఐక్యత, త్రిముఖం-ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం -పశుసంపద మరియు ధన సంపద, పంచముఖం సిరిసంపదుల వృద్ధి ఫలితములు ఉండును.

అలాగే మట్టి, వెండి పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం.

వెండి కుందులు అగ్రస్థానం . పంచ లోహపు కుందులు ద్వితియ స్థనం.

దీపారాధన చేసే తప్పుడు తప్పనసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద మరో ప్రమిద పెట్టాలి.

ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాలలో తప్పనసరిగ చెయ్యాలి. నిత్యం శుభఫలితాలను ఇస్తు, దుష్ట శక్తులు నశిస్తాయి. ఆ ఇంటా అందరు క్షేమముగా ఉంటారు.

దీపం వెలించడానికి ఒక వత్తి ఉపయోగించరాదు. ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం.దీపారాధనకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. అగ్గిపుల్లతో దీపం వెలిగించారాదు. అగరబత్తీల ద్వారా వెలిగించవచ్చు. దీపం కొండెక్కితే "ఓమ్ నమః శివాయ" అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు.

దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.

దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి. 


సేకరణ 
రవితేజశర్మ 

 



 

No comments:

Post a Comment