ప్రశ్న) వివాహంలో త్రిజ్యేష్ఠ పనికిరాదంటారు, నాలుగు జ్యేష్ఠలైతే పనికివస్తుందా!?
జవాబు) జ్యేష్ఠ త్రయము, జ్యేష్ఠ చతుర్థము, జ్యేష్ఠ పంచమము ఏవీ పనికిరావు
||శ్లో|| జ్యేష్ఠే న జ్యేష్ఠ యో: కార్యం నృనార్యోః పాణిపీడనం |
తయో రేకతరే జ్యేష్ఠే జ్యేష్ఠమా సేపి కార యేత్ |
జ్యేష్ఠ పంచక మా చార్య స్త్య జేజ్జ్యేష్ఠ చతుష్టయం|
జ్యేష్ఠ త్రయం నిషిద్ధం స్యా ద్విజ్యేష్టం చైవ మధ్యమమ్ | జ్యోతిరర్ణవే |
జ్యేష్ఠమాసమందు జ్యేష్ఠ పుత్రునకు, జ్యేష్ఠకన్యకకు వివాహము గూడదు. కన్యావరులలో ఒకరు జ్యేష్ఠు లైనయెడల చేయవచ్చును. జ్యేష్ఠపంచకముగాని, జ్యేష్ట చతుష్టయము గాని, జ్యేష్ఠత్రయముగానీ నిషిద్ధములు. జ్యేష్ఠద్వయము సామాన్యము , అనఁగా యితరమాసములలో అనుకూలము గానియెడల సంకటమందు రెండు జ్యేష్ఠలుచేయ వచ్చునని భావము. యెంత సంకట మందు త్రిజ్యేష్ఠ, చతుర్జ్యేష్ఠ, పంచ జ్యేష్ఠలు గూడవు.
కన్యావరౌయది స్యాతా మాద్య గర్భసముద్భవౌ|
తయో రేవ భవేజ్జ్యేష్ఠా నక్షత్రంచాపి వై యది|
జ్యేష్ఠమాసో భవేద్వాపి జ్యేష్ఠ పంచకమిత్యథ |
కుర్యాద్యస్తు నరో మోహా దాశు మృత్యుర్భ వేత్తయోః |
జ్యేష్టానాంతు చతుష్కంచ జ్యేష్ఠ త్రయమధాపివా!
నిషిద్ధం స్యాదథ జ్యేష్ఠ ద్వితయం శుభదం భవేత్ |
జ్యేష్ఠపంచకమనఁగా జ్యేష్ఠకన్య, జ్యేష్ఠవరుఁడు, ఇద్దరికి జ్యేష్ఠా నక్షత్రములు, జ్యేష్టమా సము ఇవి. జ్యేష్ఠ చతుష్టయమునఁ గా పై వాటిలో యే నాగోకలిసినవి, జ్యేష్టత్రయమనఁగా యిద్దఱు జ్యేష్ఠులు, జ్యేష్ఠమాసము ఇది. ఇట్లు గాక పైన చెప్పిన పంచకములో యే మూఁడుకల పిననూ జ్యేష్ఠత్రయమనఁబడును. - కాలామృత మందు యే మూఁడు కలసి ననూ జ్యేష్ఠ త్రయమగునని చెప్పఁబడి యున్నది. కాని జ్యేష్ఠమాసము మాత్రము వకటి అన్ని ప్రకారములందునూ ఉండవలయును. కాదని ఎవరైనా మోహముతో, జ్యేష్ఠ దోషమున్ననూ వివాహము చేసుకొనినచో దానికి ఫలము దంపతులకు మృత్యువు.
కనుక జ్యేష్ఠ త్రయము, జ్యేష్ఠ చతుర్థము, జ్యేష్ఠ పంచమము ఏవీ పనికిరావు.
ఏకజ్యేష్ఠ, జ్యేష్ఠ ద్వయము వివాహమునకు పనికి వచ్చును.
Guruvaryulu
R.vijay sharma సౌజన్యం తో
పురోహితులు
రవితేజ శర్మ
No comments:
Post a Comment