నమస్తేస్తు మహమాతే శ్రీ చక్ర సింహశనస్థే
శ్రీ కనక మహలక్ష్మీ కుముదపాణి నమస్తే!
నమస్తే దివ్యాభరణే సువర్ణకిరీటధరే
శ్రీ కనక మహలక్ష్మీ ఇందుహాసినే నమస్తే!
నమస్తే నీరకూపినే నీరాభిషేక ప్రియనే
శ్రీ కనక మహలక్ష్మీ నారాయణి నమస్తే!
నమస్తేస్తు నిమీళిత పద్మపత్రాయతాక్షి
శ్రీ కనక మహలక్ష్మీధ్యానముద్రణే నమస్తే!
నమస్తేస్తు వాసుదేవ భగినీ నిత్యయౌవ్వని
శ్రీ కనక మహలక్ష్మీ కంసరిపునే నమస్తే!
నమస్తే పాండుపుత్రాని అజ్ఞాతవాసతరణే
శ్రీ కనక మహలక్ష్మీ వైశాఖేశ్వరి నమస్తే!
నమస్తేస్తు కులోత్తుంగ చోళవంశ నివర్ధినే
శ్రీ కనక మహలక్ష్మీ నిర్గోపురస్థే నమస్తే!
నమస్తేజ్ఞానరూపిణే జ్ఞానధ్యానప్రదాయని
శ్రీ కనక మహలక్ష్మీ ధ్యాన సిద్ధినే నమస్తే!
నమస్తే యోగ రూపిణే యోగ భోగ స్వరూపిణే
శ్రీ కనక మహలక్ష్మీ యోగకారిణే నమస్తే!
నమస్తే నీర స్వరూపిణే క్షీరదయాంబుశీకరే
శ్రీ కనక మహలక్ష్మీ నిరతాన్నదా నమస్తే!
నమస్తే పద్మాసనస్ధే మంత్రయంత్రత్మికే
శ్రీ కనక మహలక్ష్మీ పంచభూతాత్మికేనమో!
నమస్తే పంచభూతినే పంచభూతాని సేవితే
శ్రీ కనక మహలక్ష్మీ కమలాత్మికా నమస్తే!
నమస్తే సర్వ సంక్షోభ దిగ్భందాధికారిణే
శ్రీ కనక మహలక్ష్మీ భగళాముఖి నమస్తే!
నమస్తే షాఢషకళే రాకాచంద్ర నిభాననే
శ్రీ కనక మహలక్ష్మీ షోఢశీదేవి నమస్తే!
నమస్తేస్తు ఘంటాపధే తారానాయకరూపిణే
శ్రీ కనక మహలక్ష్మీ భక్తపాలిని నమస్తే!
నమస్తేస్తు నారాయణీ గురువాసరప్రీతినే
శ్రీ కనక మహలక్ష్మీ నారాయణాత్మికే నమో!
No comments:
Post a Comment