https://youtu.be/AEsUpDhRDr0
క్షమస్త్వ భగవత్యంభ క్షమాశీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరివర్జితే. (1)
ఉపమే సర్వసాధ్వీనాం దేవానాం దేవపూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యం చ నిష్ఫలమ్ (2)
సర్వసమ్పత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ
రాసేశ్వర్యాధిదేవీ త్వం త్వత్క్కలాః సర్వయోషితః (3)
కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సిన్దుకన్యకా
స్వర్గేచ స్వర్గలక్ష్మీ స్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే (4)
వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ
గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః (5)
కృష్ణణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వం చ బృన్దా బృన్దవనే వనే (6)
కృష్ణప్రియా త్వం భాణ్డీరే చన్ద్రా చన్దనకాననే
విరజా చమ్పకవనే శతశృంగే చ సున్దరీ (7)
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే ,
కున్దదన్తీ కున్దవనే సుశీలా కేతకీవనే (8)
కదమ్బమాలా త్వం దేవీ కదమ్బకాననేఽపిచ ,
రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మిర్గృహే గృహే (9)
ఇత్యుక్త్వా దేవతా ! సర్వే మునయో మనవ స్తథా
రురు దుుర్నమ్రవదనాః శుష్కకణ్ఠోష్ఠ తాలుకాః (10)
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత ప్రాతరుత్థాయ సవై సర్వం లభేద్ధృవమ్ (11)
అభార్యో లభతే భార్యాం వినీతాం చ సుతాం సతీమ్
సుశీలాం సున్దరీం రమ్యాం మతిసుప్రియవాదినీమ్ (12)
పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
ఆపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ (13)
పరమైశ్వర్య యుక్తం చ విద్యావన్తం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీ ర్లభతే శ్రీయమ్ (14)
హత బన్దుర్లభేద్ బన్దుం ధన భ్రష్టో ధనం లభేత్ ,
కీర్తి హీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాం చ లభేత్ ధ్రువమ్ (15)
సర్వమంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
హర్షానన్దకరం శశ్వద్ధర్మ మోక్ష సుహృత్ ప్రదమ్ (16)
భావం
1. భగవతీ! అంబా ! క్షమాశీలా ! పరాత్పరీ మమ్ములను క్షమింపుము . శుద్ధ
సత్వస్వరూపిణీ ! కోపాదులను పరిత్యజింపుము .
2. సర్వసాధ్వులందు శ్రేష్ఠురాలా సర్వ దేవతా పూజితురాలా నీవు లేనిదే సర్వ జగములు మృత్యు తుల్యములై నిష్ఫలములు కాగలవు
3. దేవీ ! నీవు సంపత్స్వరూపిణివి , సర్వులయందు సర్వ రూపిణివి . రాసేశ్వర్యాధి దేవీ ! నీకళలనుండే సర్వులుద్భవించిరి
4. కైలాసంలో పార్వతివి నీవే , క్షీరసాగరమును సింధు కన్యకవు నీవే స్వర్గమునందు స్వర్గ లక్ష్మివి నీవే , భూలోక మందు మర్త్యలక్ష్మిిివి నీవే
5. వైకుంఠమందు మహాలక్ష్మివి నీవే దేవ దేవివైైన సరస్వతివినీ వే , గంగవు , తులసిని , బ్రహ్మలోకమందు సావిత్రివి నీవే
6. గోలోకమందు నీవే స్వయముగ కృష్ణ ప్రాణాధి దేవి వైన రాధవు ,
రాసమండలమందు రాసేశ్వరివి బృందావనమందు బృందవునీవు .
7. భాంఢీర వనమందు కృష్ణ ప్రియవు నీవే , చందన కాననమందు చంద్రవు నీవే , చంపక వనమందు విరజా దేవివి నీవే . శతశృంగమందు సుందరివి నీవే
8. పద్నవనమందు పద్మావతివి , మాలతీ వనమందు మాలతివి కుంద వనమందు కుందదంతివి కేతకీ వనమందు సుశీలవు నీవే .
9. కదంబ కాననమందు నీవే కదంబమాలవు , రాజు గృహమందు రాజలక్మివి గృహములందు గృహలక్ష్మివి నీవే .
10. ఇట్లు సర్వ దేవతలు , మహర్షులు , మనువులు స్తుతించి రోదించుచు నమ్ర వదనులై శుష్క కంఠోష్ఠ తాలుకా యుక్తులై అమ్మయెదుట నిలువబడిరి
11. పుణ్యమయమైన , శుభప్రదమైన సర్వదేవతలు స్తుతించిన యీ లక్ష్మీస్తోత్రమును ప్రాతః కాలమున పఠించువారికి సర్వమనొ వాంఛితలు తప్పక లభింపగలవు .
12. భార్య లేని వారికి వినీతురాలైన, సతియైన, సుశీలయైన, సుందరియైన, సుప్రియవాదినియైన,
13. శుద్ధురాలైన , ఉత్తమకుల సంజాతయైన పుత్రపౌత్రనతియైన భార్య లభింపగలదు . పుత్రులు లేని వారికి వైష్ణవుడైన , చిరంజీవియైన
14. పరమైశ్వర్య యుక్తుడైన యశస్వియైన , విద్యావంతుడైన పుత్రుడు లభింపగలదు
15. బంధువియోగము సంభవించిన వారికి బంధువులు , ధన భ్రష్టులకు ధనము లభింపగలదు . కీర్తిహీనులకు కీర్తి ప్రతిష్ఠలు నిశ్చయముగ లభింపగలవు .
16. సర్వ మంగళప్రద మైన యీస్తోత్రము శోకసంతాపనాశకము, హర్షానందకరము, ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదింపగలది
ఇతి బ్రహ్మ వైవర్త పురాణ అంతర్గత సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం