Friday, November 19, 2021

గృహప్రవేశం చేయు విధానం (పేరంటాలు దగ్గరుండి)

గృహప్రవేశం చేయు విధానం (పేరంటాలు దగ్గరుండి)(బ్రాహ్మణేతరులు)




కొన్ని ప్రాంతీయ ఆచారాల ప్రకారం గా, గ్రామాచారల ప్రకారంగా ముహూర్త సమయానికి పేరంటాలు దగ్గరుండి గృహం లో అడుగుపెట్టుట జరుగును
గృహ ప్రవేశం ముహూర్తం అంటే గృహంలో అడుగు పెట్టడమే పాలు పొంగడం ఏమీ కాదు, పాలు పొంగడానికి ప్రత్యేకించి ముహుర్తం ఏమీ ఉండదు గృహంలో అడుగుపెట్టిన తర్వాత ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమంలో చేసుకుంటూ వెళ్లడమే 

గృహ ప్రవేశమునకు కావలసిన సామగ్రి (పేరంటాలుతో)
పసుపు 150గ్రా
కుంకుమ 150 గ్రా
అగరబత్తులు 1 పెద్ద ప్యాకెట్టు
కర్పూరం పెద్ద ప్యాకెట్టు
ముద్ద కర్పూరం 2 ప్యాకెట్స్
తమలపాకులు 100 ఆకులు
 వక్కలు 100 గ్రా
గంధం డబ్బా 1
మట్టి ప్రమిద పెద్దది
పెద్ద వత్తులు 5
అగ్గిడజన్ 1
ఆవునెయ్యి మంచిది 1/4 కిలో
వరి పిండి 100 గ్రా
బెల్లం 1/2 కిలో
కొబ్బరి నూనే
బియ్యం
అక్షంతలు
ధాన్యం వేయడానికి చిన్న బుట్ట
ధాన్యం 5 లేదా 9 కుంచలు
తియ్య గుమ్మడి పళ్ళు 2
బూడిద గుమ్మడికాయ 1
చిన్న చట్టీ, చొడుపిండి
పువ్వులు
దేముడు పఠాలు
1.వినాయకుడు
2.లక్ష్మి దేవి
3.సత్య నారాయణ స్వామి
4. వెంకటేశ్వర స్వామి
5. మీ ఇష్ట దేవత ఫోటో
దేముడు కు పూల దండలు
మామిడి కొమ్మలు
గరికి గడ్డి
పువ్వులు
పొయ్య కు ఇటుకలు9
ఇసుక
మామిడి పుల్లలు ఎక్కువ
కొబ్బరి కాయలు -:2 ద్వారములు ఎన్ని ఉంటే అన్ని
అరటి పళ్ళు 4 డజన్ల











పైన చెప్పిన దానికి కావలసిన సామగ్రిని కూడా దగ్గర పెట్టుకోవాలి, ద్వారబంధము లు ఎన్ని ఉంటే అన్ని కొబ్బరికాయలు ఉండాలి, అలాగే పచ్చని పందిరి కూడా వేసుకోవడం మంచిది, గోవు ,దూడ రెండూ కూడా తీసుకొని రావడం మంచిది, ఇటుకులు 9 ఏర్పాటు చేసుకోవాలి
ద్వారబంధం అన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుని మామిడి కొమ్మ తోరణాలు అలాగే పూలదండ అలంకరణలు చేసుకొనవచ్చును
లోపల ఎటువంటి ఇనుము వస్తువులు గాని లేదంటే పనికిరాని వస్తువులు గాని చీపుర్లు గాని ఉంచకూడదు

ఈ విధానం పేరంటాలు ఉన్నప్పుడు మాత్రమే చేయవలసినది 
 (పంతులుగారు ఉన్నప్పుడు అతను చెప్పిన విధంముగా చెయ్యాలి అంతేగాని ఈ విధంగా చెయ్యండి అని చెప్పడం మంచిది కాదు ఎందుకనగా వాళ్ళ గురు పరంపరంగా వాళ్ళు చేస్తారు)

1. ముందుగా ఆవు దూడ కి నుదిటిన వెనుక భాగం లో కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టాలి, ఆవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ వెనక భాగంలో నమస్కారం చేయాలి, ఆడపిల్ల నిండు బిందే నీళ్లతో ఎదురొస్తే యజమాని యొక్క కుడిచేతి పక్కనుంచి వెనక్కు వెళితే యజమానులు తూర్పు వైపు ముఖం పెట్టి వెళ్లాలి లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి ఉత్తరం వైపు వెళ్లిన పరవాలేదు అక్కడున్న అవకాశం బట్టి
2. ఒక తీయ గుమ్మడి పండును తీసుకొని,పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, దాని మొటిక వద్ద కన్నం పెట్టీ సున్నం,పసుపు నీళ్ళు లేదా కుంకుమ,పసుపు నీళ్ళు వెయ్యాలి ఇల్లు మొత్తానికి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టాలి ప్రహరీ గేటు ఉంటే ప్రహరీ గేటు దగ్గర కొట్టాలి
గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఆవునీ పంపించాలి
3. ప్రహరీ గేటు వద్ద గుమ్మడికాయ కొట్టి ధాన్యం వేసి
ప్రహరీ లోపలికి ముందు గా అవు వెళ్ళిన తర్వాత యజమానులు మగవాళ్ళు దేవుడు పటాలు ఆడవాళ్లు పసుపు కుంకుమ, తాంబూలము లక్ష్మీదేవి ఫోటో తో, పేరంటాలు ఒకరు నిండు బుట్టతో ధాన్యము, బూడిద గుమ్మడి పండు, పాల గిన్నె, పాలు, కొబ్బరికాయలు, ద్వారబంధము దగ్గరికి వెళ్లడానికి ధాన్యము, ఒక్కొక్కరు ఒక వస్తువును పట్టుకొని లోపలకు వెళ్ళాలి 

 4.సింహద్వారం దగ్గర కూడా ధాన్యం వేసి కొబ్బరి కాయ కొట్టి , ఆవు వెళ్ళిన తర్వాత అప్పుడు యజమానులు లోపలికి వెళ్లాలి, హలు లో నాలుగు మూలలా కూడా ధాన్యం వెయ్యాలి

5. ఇంట్లో ఉన్న మాస్టర్ బెడ్ రూమ్ ద్వారం నైరుతి ద్వారం దగ్గరకు వెళ్లి అక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి ప్రవేశం చేసి ఈ లోపల నాలుగు మూలలా కూడా
 ధాన్యం చేయాలి

6.తరువాత చిల్డ్రన్ బెడ్ రూమ్ లో ద్వారం దగ్గర కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్లి నాలుగు మూలల ధాన్యం చేయాలి

7. తర్వాత ఆగ్నేయ మూల లో ఉండే వంట గది లోపలికి వెళ్లి , డైనింగ్ హాల్ వున్న అందులోకి వెళ్లి
అక్కడున్న ద్వారాల దగ్గర కూడా ధాన్యం వేసి కొబ్బరికాయ కొట్టాలి

8. మిగతా తూర్పు ద్వారాలు, బాత్రూం కూడా ద్వారం పెడితే అక్కడ కూడా దాన్యం వేసి కొబ్బరికాయ కొట్టాలి

9. ఆఖరిని పూజ గది ద్వారం దగ్గర ధాన్యం వేసి,కొబ్బరికాయ కొట్టి, లోపల కొత్త దేవుడు పిట ఉన్న ఆ దేవుడు పెట్టవచ్చును లేదా ధాన్యం వేసి మా ధాన్యం పైన దేవుడు పటాలు పెట్టాలి, అక్కడ నిండు బింది నీళ్ళు, బుట్ట తో ధాన్యం పైన గుమ్మడి పండు, గళ్ళు ఉప్పు ,తాంబూలం,అమ్మ గారు ఇచ్చిన చలిమిడి 
దేముడు మూల పెట్టాలి, చట్టీ లో చోడు పిండి నాన బెట్టాలి, దేవుడు మూల గద్దె రాశి కుంకుమ బొట్లు పెట్టాలి
దేవుడి పటాలు అక్కడ పెట్టీ దేవుడు పటానికి పూల దండలు అలంకరణ చేసుకోవాలి
మూడు రోజులు వెళ్ళవలసిన అఖండ దీపాన్ని
పెట్టాలి అనగా ప్రమిదలో ఆవునెయ్యి వేసి పెద్ద వత్తులు వేసి దీపం వెలిగించాలి తర్వాత కొబ్బరి నూనె వేసుకోవచ్చు

10. ముందుగా ఒక పసుపు గణపతిని తయారు చేసి
గణపతికి గంధము కుంకుమ బొట్టు పెట్టి ఇ దేవుడు పటాలు దగ్గర పెట్టాలి ఆ గణపతి కి మూడు సార్లు అక్షంతలు వేసి, 4 సార్లు మామిడి అకుతో నీళ్లు వేసి,పువ్వు వేసి, అక్షంతలు వేసి, గంధం వేసి, పువ్వులు వేసి, ఓం గం గణపతయే నమః అని
గరిక గడ్డి 16సార్లు వేసి, అగరవత్తులు వెలిగించి ధూపం చూపించే, దీపం నమస్కారం చేసుకుని, బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, తాంబూలం పెట్టి, హారతి వెలిగించి, నమస్కారం చేసుకుని మనసులో కోరికలు తలుచుకోవాలి
11. ఆ దేవుడి పటాలు అందరి దేవుళ్ళకి కూడా నమస్కారం చేసుకుని, పైన పెట్టిన పసుపు గణపతి ఏవిధంగా చేశారో ఆ విధంగానే ఆ ఫోటోలు అన్నిటికీ కూడా ఒకసారి చేయవచ్చును (గరిక గడ్డి వెయ్యి అక్కర్లేదు) ఒక తమలపాకులో పసుపు కొమ్ము ను పెట్టీ
ఓం మహాలక్ష్మి దేవ్య నమః అని 21 సార్లు కుంకుమ పూజ ఆ పసుపు కొమ్ము కి చెయ్యండి
12. అలాగే వంట గదిలో ఇసుక వేసి, 9 ఇటుకలతో అని పొయ్య ఏర్పాటు చేసి, కొత్త ఇత్తడి గిన్నె పెట్టి
ఆడపిల్ల పేరంటాలు తో పాలు అందులో వేసి పొయ్యి వెలిగించి పాలు పొంగించాలి, పాలు పొంగిన తర్వాత
కొంచెం నెయ్యి కలిపిన బియ్యాన్ని పాలల్లో వేయాలి అందరూ, పరవాన్నం వండుకున్న తర్వాత
13. లక్ష్మీదేవికి ఆ పరవాన్నం ని నైవేద్యంగా చూపించి, కొబ్బరికాయ కొట్టి, హారతి చూపించి, అమ్మవారి దగ్గర పటాలు దగ్గర పువ్వులు వెయ్యాలి
14. వచ్చిన పేరంటాల కి పెద్దవాళ్ళకి దంపతులిద్దరూ నీ కంటే పెద్ద వాళ్ళు అందరికీ కూడా నమస్కారం చేయాలి, వాళ్ల చేత అక్షంతలు వేయించుకోవాలి
15. పేరంటాలు అందరికీ శక్తి బట్టి తాంబూలాన్ని ఇవ్వాలి
16. గృహ ప్రవేశం దగ్గరుండి చేయించిన పెద్ద పేరంటాలు ఎవరైనా ఉంటే ఆవిడకి శక్తి బట్టిచీర కూడా పెట్టవచ్చును చాలా మంచిది
17. మేస్త్రి గారికి తాపీ వడ్రంగి పని వాళ్లకి బట్టలు ఇవ్వవచ్చును మిశక్తి బట్టి
18. ప్రసాదం అందరూ తీసుకోవాలి

శుభం గృహప్రవేశ అనుకూలత ఫలసిద్ధిరస్తు
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు, ధన కనక వస్తు వాహన సకలసంపదలు ప్రాప్తిరస్తు, సకల కార్య దిగ్విజయ మస్తు






No comments:

Post a Comment