Friday, March 19, 2021

శంకుస్థాపన చేసిన తర్వాత గృహంలోని నిర్మాణం చేస్తున్నప్పుడు పంతులుగారిని సంప్రదించవలసిన సమయాల

శంకుస్థాపన చేసిన తర్వాత గృహంలోని నిర్మాణం చేస్తున్నప్పుడు పంతులుగారిని సంప్రదించవలసిన సమయాల
 1) బోరు వేయించినప్పుడు దాని పాయింట్ ఎక్కడనేది నిర్ణయం తీసుకోవాలి
2) లెటర్ ట్యాంక్ కూడా ఏ విధంగా నిర్మాణం చేసుకుంటున్నాము చూసుకోవాలి
3)పిల్లర్స్ ఎన్ని  వేసుకున్నామని చూసుకోవాలి బేసి సంఖ్యలో 9 వేయొచ్చు అంతకన్నా ఎక్కువైనా సరి సంఖ్య తీసుకోవాలి
4) ద్వారములు కిటికీలు కబోర్డ్స్ వాస్తు పరమైన నిర్ణయం తో పెట్టుకోవాలి
5) ఏ మాత్రం సందేహం ఏర్పడిన పంతులు గారిని అడగాలి


వాస్తు విషయములు-: మనం ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు బయట ప్రహరీకి ఏటువంటి కట్టడాలు తగిలించ రాదు
 1)నైరుతిలో బాత్రూం, మెట్లు అలాగే ఎలివేషన్స్ ట్యాంకులు వంట గదులు ఇంకా బయట వసారాలో నిర్మించే ప్రతి గది కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రహరీకి తగలకూడదు ఎందుకంటే దానికి బహిర్గతం గా ఉండే వాస్తు పరమైన దోషాలను కూడా ఇంటి అంతర్గతంగా ఏర్పడతాయి
అలా తగిలించిన కట్టడానికి మిగతా బ్రేక్ జాయింట్ పెడదాం అని ఆలోచన కూడా తప్పు మీరు అక్కడ బ్రేక్ ఇచ్చారు అంటే అక్కడ ప్రహరీ లేనట్టే , ఆ విధంగా నైరుతి వాయువ్యం ఆగ్నేయము ఉండే కష్టాలు ఇవ్వడం వల్ల ఆ మూలల్లో ప్రహరీ లేదు అని చూపించుకోవడం వల్ల కొంత వాస్తు పరమైన ఇబ్బందులు ఏర్పడతాయి
2) నవగ్రహ ద్వారాలని తీసుకుని ఉత్తరద్వారం ఎప్పుడూ కూడా శుక్ర స్థానంలో పెట్టుకోవడం దక్షిణ బుధ స్థానాల్లో పెట్టుకోవడం ద్వారా 
పడమర ద్వారం శుక్ర స్థానంలోని ని, తుర్పు ద్వారం బుధ స్థానంలోని పెట్టవచ్చును ఒకవేళ అంతర్ బహిర్గత కొనిలు తగలడం అక్కడున్న వాస్తు పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా అనిపిస్తే తూర్పు ద్వారం దక్షిణ ద్వారాన్ని చంద్ర స్థానంలో కూడా పెట్టవచ్చును అది రెండవ విధానం
3)కబోర్డ్స్ పడమర గోడకి పెట్టుకోవడం చాలా ఉత్తమం ఒకవేళ అలా వీలు కానిచో దక్షిణ గోడకు పెట్టుకోవచ్చు (పూర్వ వాస్తు లోని తూర్పు,ఉత్తర గోడలకి పెట్టుకోవచ్చు గానీ)ఇప్పుడు నిర్మాణ విషయాల్లో కొంత పరికరాలు వాడికి తేడా ఉండటం వల్ల ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది అలాగే దారులతో వాడిన చెక్కతో వాడిన బీరువాలు ఏమైనా పెట్టుకునేటప్పుడు అది ఉత్తర భాగంలో పెట్టుకోవడం చాలా మంచిది లేదా ఉత్తరంలో డ్రెస్సింగ్ టేబుల్ దానిలో లాకర్ సెట్ చేసుకుని అది వాడుకోవచ్చు
4)ద్వారములు అన్నీ కూడా ఏక వరుసలో ఉండేలా పెట్టుకోవాలి అంతేగాని ఒకటి ఒక పక్క ఇంకొకటి ఇంకో పక్క పెట్టకూడదు
5)ప్రహరీ గాని బయటికి గచ్చు గానీ ఇంట్లో గచ్చు గానీ,పిట్ట గోడ గానీ నైరుతి కొంచెం ఎత్తుగా ఈశాన్యంగా పల్లంగా పెట్టుకోవాలి
6)ప్రహరి లో లెటర్ టాంక్ తవ్వుతున్నప్పుడు కచ్చితంగా ఈశాన్యంలో బోర్ గాని, సంపు గాని, ఇంకుడు గొయ్యిగాని ఇవ్వాలి
7)ఎప్పుడు పడమర దక్షిణం పూర్తిగా ప్లేస్ లేకుండా నిర్మాణం చేయకూడదు తదుపరి వదిలి కట్టడానికి అవటం లేదు అని చెప్పి మన ప్రహరీ కట్టుకోకుండా నిర్మాణం కూడా చేయకూడదు మనకి పడమర ప్రహరీ లేకుండా తూర్పు ప్రహరీ కట్టిన వాళ్ళమవుతాం దక్షిణం లేకుండా ఉత్తరం ప్రహరీ కట్టిన వాళ్లమవుతాం దాని వల్ల బరువు అనేది ఏర్పడుతుంది రెండవది అవతల పక్క వాళ్ళు ఈశాన్యం పెంచాలి అనే ఉద్దేశంతో 06 అంగుళాలు పెంచిన మనకి నైరుతి పెరిగిపోతుంది అది దోషం
8. స్లెబ్ యొక్క నీరు మన ప్రహరీ లోపల పడాలి
9.ద్వారములు కింద కమ్మీ లేకుండా పెట్టడం అనేది ఇప్పుడు అధునాతనంగా కనిపెట్టారు అది వాస్తు విషయం కాదు ,వాస్తు లోని నాలుగు బంధములు కలిసిన ద్వారబంధము అన్నారు కాబట్టి 4 బంధాలు ఉండాలి , 1 తలుపు పెట్టడం అనేది అది ఇది మన సొంత నిర్ణయం వాస్తు ప్రకారం గా అడిగితే 2 తలుపులు పెట్టాలి


..................



Wednesday, March 17, 2021

ద్వారబంధం పెట్టు విధానం, కావలసిన పూజా సామాగ్రి





1.ముందుగా మీకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం గా గానీ లేదంటే వాస్తు ప్రకారం గాని చెప్పిన స్థానాల్లో ద్వారా బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి సింహద్వారము ముహూర్తం ప్రకారంగా పెట్టడం
చాలా ముఖ్యము

2. పసుపు రాసి వరిపిండి కుంకుమ బొట్లు పెట్టుకుని మామిడి కొమ్మ,నేరేడు కొమ్మ, అవకాశం వున్న రావి కొమ్మ తోరణం కట్టాలి

3.పసుపు గుడ్డులోని రాగి పైసా ,అక్షంతలు ,పసుపు కొమ్ము కట్టి వాటిని  ద్వారబంధం కు కట్టాలి 

4. ముందు దీపారాధన చేయాలి
 పసుపు గణపతిని తయారు చేసుకోవాలి, గంధం వెయ్యాలి, పూలు గణపతి కి పెట్టాలి
          అగరబత్తులు వెలిగించాలి
దీపం చూపించాలి, నైవేద్యం చూపించాలి

5.ముహూర్త సమయానికి ద్వారం పెట్టాలి తర్వాత ద్వారం పైన గంధం వెయ్యాలి, పూలు పెట్టాలి,అగరబత్తులు వెలిగించాలి
దీపం చూపించాలి, నైవేద్యం చూపించాలి
పంచల చాపు గాని, పంచె కండువా గాని,బట్టలు గాని ,ద్వారం పైన వేయాలి
కొబ్బరికాయను కొట్టి, తాంబూలం పెట్టి, హారతి ఇవ్వాలి,

6. యజమాని యజమానురాలు ఇద్దరూ ఉంటే కొబ్బరికాయ కొట్టి ద్వారం లోపలికి అడుగు పెట్టాలి
యజమాని లేకపోయినా ముఖ్యంగా యజమానురాలు మాత్రం అడుగు పెట్టాలి
తరువాత పేరంటాలు కొబ్బరికాయ కొట్టలి
తర్వాత మేస్త్రి గారు కొబ్బరికాయ కొట్టలి 
తర్వాత ద్వారం తయారుచేసిన కార్పెంటర్ కొబ్బరికాయ కొట్టవచ్చును ఒకవేళ అక్కడికి వచ్చిన

7. వచ్చిన పేరంటాలు అందరికీ తాంబూలం ఇవ్వాలి

8. మేస్త్రి గారికి ఒకవేళ కార్పెంటర్ కూడా వస్తే అతనికి తాంబూలం దక్షిణ పెట్టి ఇవ్వాలి


కావలసిన సామగ్రి-: పసుపు,కుంకుమ,
అగర బత్తులు ,కర్పూరం ,తమలపాకులు వక్కలు ,అరటి పళ్లు ,కొబ్బరికాయ, మామిడి కొమ్మ , నేరేడు కొమ్మ, పసుపు గుడ్డ, రాగి పైసా,అక్షంతలు, చిల్లర డబ్బులు, దీపారాధనకు ప్రమిద,ఒత్తులు, ఆవునెయ్య కొబ్బరినూనె అగ్గిపెట్టె, పసుపుకొమ్ములు, వరిపిండి,దారపురీలు, పంచి కండువా లేదా పంచుల చాపు లేదా బట్టలు



Tuesday, March 16, 2021

అన్నప్రాసన చేయు విధానం (బ్రాహ్మణేతరులు) అన్నప్రాసన ఎందుకు చేయాలి అంటే శిశువు యొక్క ఆరోగ్యం బాగుండడం కోసం

అన్నప్రాసన చేయు విధానం
(బ్రాహ్మణేతరులు)
 అన్నప్రాసన ఎందుకు చేయాలి అంటే శిశువు యొక్క ఆరోగ్యం బాగుండడం కోసం
    శాస్త్ర అనుసారము మగ పిల్లలకి 6,8,10,12 మాసాల్లో సరి మాసాల్లో అన్నప్రాసన చేయాలి
 ఆడపిల్లలకి 9,11నెలలలో అన్నప్రాసన చెయ్యాలి

1. ముందుగా ఇంట్లో దీపారాధన చేయాలి
2. పసుపు గణపతిని తయారు చేసుకోవాలి, గంధం వెయ్యాలి, పూలు గణపతి కి పెట్టాలి
          అగరబత్తులు వెలిగించాలి
దీపం చూపించాలి, నైవేద్యం చూపించాలి
3. పరవాన్నం వెండి గిన్నె లో పెట్టుకుని
 దేవుడి దగ్గర పెట్టుకుని మీ ఇష్టదేవతను మీ కులదేవతను మీ గ్రామదేవతను తలుచుకుని
 మీ దేవుడు మందిరం లో ముందు చేసిన విధంగానే
గంధం వెయ్యాలి, పూలు గణపతి కి పెట్టాలి
          అగరబత్తులు వెలిగించాలి
దీపం చూపించాలి, నైవేద్యం చూపించాలి
4. తరువాత జీవికా పరీక్ష అనేది చేయాలి అనగా ఒక తెల్లని వస్త్రం తీసుకుని దానిపైన క్రింది వస్తువులు అన్ని కూడా పెట్టాలి
1) పసుపు కుంకుమ, పువ్వులు, పళ్ళు 
2) పట్టు వస్త్రములు( పాతది అయినా పర్వాలేదు)
3) ధనం
4) బంగారము వెండి సామాగ్రి
5) పరవాన్నం గిన్నె
6) పుస్తకం పెన్ను
7) ఆట వస్తువులు
8) దేవుడు పటములు
9) చాకు కత్తి
  పైన వస్తువులన్నీ వరుసగా పరిచి
 శిశువును మూడుసార్లు విడిచిపెట్టాలి
 పట్టుకున్న వస్తువుల్ని తీయాలి
 తర్వాత ముట్టుకో లేని వస్తువుల మీద చెయ్య వేయించి
 పంతులు గారు చెప్పిన ముహూర్త సమయమునకు పరవాన్నం
 తల్లి తండ్రి ముందు నోట్లో పెట్టాలి, తదుపరి పెద్దలు పేరంటాలు అందరూ కూడా పెట్టవచ్చును

 పై విధంగానే అందరూ చేయాలనే నియమం ఏటువంటిది లేదు
 దేశ కాల మాన పరిస్థితుల ప్రకారంగా చేసుకొనవచ్చును
 దేశ చారము, ప్రాంత చారము ,కుల చారము మతాచారం ,కుటుంబ చారము
 వీటిని నిర్దేశించిన ప్రకారం, ఇలాంటివి మీ యొక్క ఆలోచన ప్రకారం గా చేసుకొనవచ్చును 
  ముహూర్తం అనేది శాస్త్ర ప్రకారం గా పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని

కేశఖండన కూడా మగ పిల్లలకి సరి మాసములు (8,10,12)
ఆడపిల్లలకు బేసి మాసంలో (9,11) చేయించాలి


Monday, March 8, 2021

ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ప్రాథమిక వాస్తు విషయాలు( శంకుస్థాపన వరకు)

ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ప్రాథమిక వాస్తు విషయాలు( శంకుస్థాపన వరకు)

1. ముందుగా మనం ఏదైనా ఒక స్థలం కొనాలి అన్నా దాని పూర్వం ఆ స్థలం దేనికి ఉపయోగించారు అనేది తెలుసుకోవాలి
(అయం ప్రకారంగా స్థలం ఎంచుకోవడం)
2. చాలా పాత ఇల్లు, లేదా పాడుబడ్డ ఇల్లు
ఇల్లు ఇలాంటివి ఉన్న స్థలాలు 
పెద్దపెద్ద వృక్షములు పుట్టలు , చుట్టుపక్కల వాళ్ళకి చెత్తపోసిన జాగాలు, కాలువలు,కుండ పెంకులు
ఉన్న జాగా తీసుకోరాదు 
3. అత్యవసరమై తీసుకోవాలి అన్న , పశువులు శాల వున్నా  పై విధంగా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా
ముందుగా పంచ ధాన్యములు జల్లలి
గోధుమలు,ధాన్యం,పచ్చ పెసలు ,కొమ్ము శెనగలు, బొబ్బర్లు అన్నీ కలిపి స్థలం మొత్తం జల్లాలి
4. ఇంకా అవకాశం ఉన్న సరే ఉదకశాంతి, రుద్రాభిషేక లక్ష్మీ గణపతి హవనము కూడా చేయవచ్చును
5. తర్వాత శంకుస్థాపన కి ముందు పంచగవ్య శుద్ధి చేసుకోవాలి
  అనగా ఆవు పాలు,ఆవు పాలు పెరుగు,ఆవు నెయ్యి,అవు ఉచ్చ,అవు పేడ,దేవాలయం గంగ,పసుపు అన్నీ నిండు బిందె నీళ్లల్లో కలిపి స్థలం అంత కళ్ళాపు జల్లాలి
6.స్థలం ను ముందుగా మూలమట్టం వేసుకునే
 ఆ కొలతల తో ఒక టెంపరరీ ప్లాన్. ( ఒక ఆలోచనకు) చేయించుకోవాలి
7. ఆ ప్లాన్ ను వాస్తు చెప్పే పంతులుగారు దగ్గరికి తీసుకుని వెళ్లి మీ పేరు బలాలు కి సరిపోయే అయము, ఆయుష్షును కట్టించుకోవాలి అనగా కొలతలు
8. ఆ కొలతలు తీసుకుని వెళ్ళి అప్పుడు మెయిన్
ప్లాన్ గీయుంచు కోవాలి
9. ఇసుక రాయి వేయించి ముగ్గు వేసి,గొయ్య తవ్వుటకు ముహూర్తం చూసు కోవాలి
10. శంకుస్థాపన ముహూర్తం చూసుకోవాలి
11. శంకు,మత్య యంత్రం వేసుకోవలేను