1. ముందుగా మనం ఏదైనా ఒక స్థలం కొనాలి అన్నా దాని పూర్వం ఆ స్థలం దేనికి ఉపయోగించారు అనేది తెలుసుకోవాలి
(అయం ప్రకారంగా స్థలం ఎంచుకోవడం)
2. చాలా పాత ఇల్లు, లేదా పాడుబడ్డ ఇల్లు
ఇల్లు ఇలాంటివి ఉన్న స్థలాలు
పెద్దపెద్ద వృక్షములు పుట్టలు , చుట్టుపక్కల వాళ్ళకి చెత్తపోసిన జాగాలు, కాలువలు,కుండ పెంకులు
ఉన్న జాగా తీసుకోరాదు
3. అత్యవసరమై తీసుకోవాలి అన్న , పశువులు శాల వున్నా పై విధంగా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా
ముందుగా పంచ ధాన్యములు జల్లలి
గోధుమలు,ధాన్యం,పచ్చ పెసలు ,కొమ్ము శెనగలు, బొబ్బర్లు అన్నీ కలిపి స్థలం మొత్తం జల్లాలి
4. ఇంకా అవకాశం ఉన్న సరే ఉదకశాంతి, రుద్రాభిషేక లక్ష్మీ గణపతి హవనము కూడా చేయవచ్చును
5. తర్వాత శంకుస్థాపన కి ముందు పంచగవ్య శుద్ధి చేసుకోవాలి
అనగా ఆవు పాలు,ఆవు పాలు పెరుగు,ఆవు నెయ్యి,అవు ఉచ్చ,అవు పేడ,దేవాలయం గంగ,పసుపు అన్నీ నిండు బిందె నీళ్లల్లో కలిపి స్థలం అంత కళ్ళాపు జల్లాలి
6.స్థలం ను ముందుగా మూలమట్టం వేసుకునే
ఆ కొలతల తో ఒక టెంపరరీ ప్లాన్. ( ఒక ఆలోచనకు) చేయించుకోవాలి
7. ఆ ప్లాన్ ను వాస్తు చెప్పే పంతులుగారు దగ్గరికి తీసుకుని వెళ్లి మీ పేరు బలాలు కి సరిపోయే అయము, ఆయుష్షును కట్టించుకోవాలి అనగా కొలతలు
8. ఆ కొలతలు తీసుకుని వెళ్ళి అప్పుడు మెయిన్
ప్లాన్ గీయుంచు కోవాలి
9. ఇసుక రాయి వేయించి ముగ్గు వేసి,గొయ్య తవ్వుటకు ముహూర్తం చూసు కోవాలి
10. శంకుస్థాపన ముహూర్తం చూసుకోవాలి
11. శంకు,మత్య యంత్రం వేసుకోవలేను
No comments:
Post a Comment