Tuesday, March 16, 2021

అన్నప్రాసన చేయు విధానం (బ్రాహ్మణేతరులు) అన్నప్రాసన ఎందుకు చేయాలి అంటే శిశువు యొక్క ఆరోగ్యం బాగుండడం కోసం

అన్నప్రాసన చేయు విధానం
(బ్రాహ్మణేతరులు)
 అన్నప్రాసన ఎందుకు చేయాలి అంటే శిశువు యొక్క ఆరోగ్యం బాగుండడం కోసం
    శాస్త్ర అనుసారము మగ పిల్లలకి 6,8,10,12 మాసాల్లో సరి మాసాల్లో అన్నప్రాసన చేయాలి
 ఆడపిల్లలకి 9,11నెలలలో అన్నప్రాసన చెయ్యాలి

1. ముందుగా ఇంట్లో దీపారాధన చేయాలి
2. పసుపు గణపతిని తయారు చేసుకోవాలి, గంధం వెయ్యాలి, పూలు గణపతి కి పెట్టాలి
          అగరబత్తులు వెలిగించాలి
దీపం చూపించాలి, నైవేద్యం చూపించాలి
3. పరవాన్నం వెండి గిన్నె లో పెట్టుకుని
 దేవుడి దగ్గర పెట్టుకుని మీ ఇష్టదేవతను మీ కులదేవతను మీ గ్రామదేవతను తలుచుకుని
 మీ దేవుడు మందిరం లో ముందు చేసిన విధంగానే
గంధం వెయ్యాలి, పూలు గణపతి కి పెట్టాలి
          అగరబత్తులు వెలిగించాలి
దీపం చూపించాలి, నైవేద్యం చూపించాలి
4. తరువాత జీవికా పరీక్ష అనేది చేయాలి అనగా ఒక తెల్లని వస్త్రం తీసుకుని దానిపైన క్రింది వస్తువులు అన్ని కూడా పెట్టాలి
1) పసుపు కుంకుమ, పువ్వులు, పళ్ళు 
2) పట్టు వస్త్రములు( పాతది అయినా పర్వాలేదు)
3) ధనం
4) బంగారము వెండి సామాగ్రి
5) పరవాన్నం గిన్నె
6) పుస్తకం పెన్ను
7) ఆట వస్తువులు
8) దేవుడు పటములు
9) చాకు కత్తి
  పైన వస్తువులన్నీ వరుసగా పరిచి
 శిశువును మూడుసార్లు విడిచిపెట్టాలి
 పట్టుకున్న వస్తువుల్ని తీయాలి
 తర్వాత ముట్టుకో లేని వస్తువుల మీద చెయ్య వేయించి
 పంతులు గారు చెప్పిన ముహూర్త సమయమునకు పరవాన్నం
 తల్లి తండ్రి ముందు నోట్లో పెట్టాలి, తదుపరి పెద్దలు పేరంటాలు అందరూ కూడా పెట్టవచ్చును

 పై విధంగానే అందరూ చేయాలనే నియమం ఏటువంటిది లేదు
 దేశ కాల మాన పరిస్థితుల ప్రకారంగా చేసుకొనవచ్చును
 దేశ చారము, ప్రాంత చారము ,కుల చారము మతాచారం ,కుటుంబ చారము
 వీటిని నిర్దేశించిన ప్రకారం, ఇలాంటివి మీ యొక్క ఆలోచన ప్రకారం గా చేసుకొనవచ్చును 
  ముహూర్తం అనేది శాస్త్ర ప్రకారం గా పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని

కేశఖండన కూడా మగ పిల్లలకి సరి మాసములు (8,10,12)
ఆడపిల్లలకు బేసి మాసంలో (9,11) చేయించాలి


No comments:

Post a Comment