Wednesday, March 17, 2021

ద్వారబంధం పెట్టు విధానం, కావలసిన పూజా సామాగ్రి





1.ముందుగా మీకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం గా గానీ లేదంటే వాస్తు ప్రకారం గాని చెప్పిన స్థానాల్లో ద్వారా బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి సింహద్వారము ముహూర్తం ప్రకారంగా పెట్టడం
చాలా ముఖ్యము

2. పసుపు రాసి వరిపిండి కుంకుమ బొట్లు పెట్టుకుని మామిడి కొమ్మ,నేరేడు కొమ్మ, అవకాశం వున్న రావి కొమ్మ తోరణం కట్టాలి

3.పసుపు గుడ్డులోని రాగి పైసా ,అక్షంతలు ,పసుపు కొమ్ము కట్టి వాటిని  ద్వారబంధం కు కట్టాలి 

4. ముందు దీపారాధన చేయాలి
 పసుపు గణపతిని తయారు చేసుకోవాలి, గంధం వెయ్యాలి, పూలు గణపతి కి పెట్టాలి
          అగరబత్తులు వెలిగించాలి
దీపం చూపించాలి, నైవేద్యం చూపించాలి

5.ముహూర్త సమయానికి ద్వారం పెట్టాలి తర్వాత ద్వారం పైన గంధం వెయ్యాలి, పూలు పెట్టాలి,అగరబత్తులు వెలిగించాలి
దీపం చూపించాలి, నైవేద్యం చూపించాలి
పంచల చాపు గాని, పంచె కండువా గాని,బట్టలు గాని ,ద్వారం పైన వేయాలి
కొబ్బరికాయను కొట్టి, తాంబూలం పెట్టి, హారతి ఇవ్వాలి,

6. యజమాని యజమానురాలు ఇద్దరూ ఉంటే కొబ్బరికాయ కొట్టి ద్వారం లోపలికి అడుగు పెట్టాలి
యజమాని లేకపోయినా ముఖ్యంగా యజమానురాలు మాత్రం అడుగు పెట్టాలి
తరువాత పేరంటాలు కొబ్బరికాయ కొట్టలి
తర్వాత మేస్త్రి గారు కొబ్బరికాయ కొట్టలి 
తర్వాత ద్వారం తయారుచేసిన కార్పెంటర్ కొబ్బరికాయ కొట్టవచ్చును ఒకవేళ అక్కడికి వచ్చిన

7. వచ్చిన పేరంటాలు అందరికీ తాంబూలం ఇవ్వాలి

8. మేస్త్రి గారికి ఒకవేళ కార్పెంటర్ కూడా వస్తే అతనికి తాంబూలం దక్షిణ పెట్టి ఇవ్వాలి


కావలసిన సామగ్రి-: పసుపు,కుంకుమ,
అగర బత్తులు ,కర్పూరం ,తమలపాకులు వక్కలు ,అరటి పళ్లు ,కొబ్బరికాయ, మామిడి కొమ్మ , నేరేడు కొమ్మ, పసుపు గుడ్డ, రాగి పైసా,అక్షంతలు, చిల్లర డబ్బులు, దీపారాధనకు ప్రమిద,ఒత్తులు, ఆవునెయ్య కొబ్బరినూనె అగ్గిపెట్టె, పసుపుకొమ్ములు, వరిపిండి,దారపురీలు, పంచి కండువా లేదా పంచుల చాపు లేదా బట్టలు



No comments:

Post a Comment